Krishna District TDP vs Janasena : కృష్ణా జిల్లాలో జనసేన, టీడీపీ సిగపట్లు !
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ-జనసేన (TDP-Janasena) మధ్య సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరావడం లేదు. జిల్లాలో జనసేన (Janasena) కచ్చితంగా నాలుగు స్థానాలను కేటాయించాలని... తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) తేల్చి చెప్పినట్టు చర్చ జరుగుతోంది. స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా... అటు టీడీపీ (TDP) నేతలు కూడా సీట్ల కేటాయింపు వ్యవహారంలో పావులు కదుపుతున్నారని సమాచారం.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ-జనసేన (TDP-Janasena) మధ్య సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరావడం లేదు. జిల్లాలో జనసేన (Janasena) కచ్చితంగా నాలుగు స్థానాలను కేటాయించాలని… తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) తేల్చి చెప్పినట్టు చర్చ జరుగుతోంది. స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా… అటు టీడీపీ (TDP) నేతలు కూడా సీట్ల కేటాయింపు వ్యవహారంలో పావులు కదుపుతున్నారని సమాచారం. జనసేన నాలుగు సీట్లు అడిగితే 3 సీట్లకు మాత్రమే పరిమితం చేయాలనే ఉద్దేశంలో టీడీపీ స్థానిక నేతలు ఉన్నారట.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో బెజవాడ (Bejawada) పశ్చిమ, అవనిగడ్డ, పెడన, కైకలూరు స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఇప్పటికే ఈ స్థానాల్లో జనసేన అభ్యర్థులు కూడా పూర్థి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నారట. పార్టీ నుంచి క్లారిటీ కోసమే ఎదురుచూస్తున్నారట. కీలకమైన బెజవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే…ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా పోతిన వెంకట మహేష్ దాదాపు ఖరారైనట్టుగానే పార్టీ వర్గాల సమాచారం. టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, జలీల్ ఖాన్ తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే జనసేనకే ఈ టికెట్‌ను ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకునే నియోజకవర్గాల్లో అవనిగడ్డ కూడా ఉంది. ఇక్కడ నుంచి విక్కుర్తి శ్రీనివాస్… జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారనేది లోకల్ టాక్. శ్రీనివాస్ ఇప్పటికే పవన్ ను కూడా కలిశారనీ… ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది స్థానిక నేతలు చెబుతున్న మాట. ఇక్కడ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ టికెట్ ఆశిస్తున్నప్పటికీ జనసేన మాత్రం ఖచ్చితంగా ఈ టికెట్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతోంది. పెడన సీటును కూడా జనసేన కోరుతోంది. ఇక్కడ నుంచి బాలశౌరి కుమారుడు బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కాగిత కృష్ణప్రసాద్ టిక్కెట్ ఆశిస్తున్నారు.
ఇప్పటికే కాగిత కృష్ణ ప్రసాద్ తన ప్రచార కార్యక్రమాల్లో పెడన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అని ముద్రించుకుని ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గంలో కాపు, గౌడ వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో… ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశం కత్తిమీద సాములా మారింది. ఇక కైకలూరు సీటును కూడా జనసేన ఆశిస్తోంది. ఇక్కడ నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తారనేది లోకల్ టాక్. మొత్తంగా మూడు సీట్లకు టీడీపీ నాలుగు కావాలని జనసేన కోరుతుండగా ఏం జరుగుతుందనే టెన్షన్ రెండు పార్టీల్లో ఉందట.