Pawan Kalyan: పి.గన్నవరం టిక్కెట్ జనసేనకే.. రెండు స్థానాలకు జనసేన అభ్యర్థుల ప్రకటన..

ఇక్కడి నుంచి రాజేష్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో జనసేన అభ్యర్థిని ప్రకటించింది. పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 23, 2024 | 08:05 PMLast Updated on: Mar 23, 2024 | 8:05 PM

Janasena Announced P Gannavaram Ticket To Giddi Satyanarayana

Pawan Kalyan: మహాసేన రాజేష్‌కు టీడీపీ కేటాయించిన పి.గన్నవరం టిక్కెట్ ఇప్పుడు జనసేనకు దక్కింది. ఇక్కడి నుంచి రాజేష్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో జనసేన అభ్యర్థిని ప్రకటించింది. పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయనకు ఎన్నికల నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పి.గన్నవరం నియోజకవర్గంలో గెలుపు జనసేనదే అన్నారు.

Kajal Aggarwal: కాజల్ డీప్ ఫేక్ వీడియో.. ఇలా మార్ఫింగ్ చేశారేంట్రా..?

రాబోయే ఎన్నికలు రాష్ట్రం దిశదశను నిర్దేశించేవని, ప్రతి స్థానం కీలకమే అని అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న గిడ్డి సత్యనారాయణ గతంలో హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా పని చేశారు. రెండు నెలల క్రితమే ఆయన జనసేనలో చేరారు. జనసేన శనివారం మరో అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఏలూరు జిల్లా పోలవరం స్థానం నుంచి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు పోటీ చేయబోతున్నారు. గిడ్డి సత్యనారాయణ, చిర్రి బాలరాజు.. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. పి.గన్నవరం నియోజకవర్గ టిక్కెట్‌ను చంద్రబాబు.. టీడీపీ అభ్యర్థి అయిన మహాసేన రాజేష్‌కు కేటాయించారు. అయితే, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల టీడీపీ, జనసేన నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అనంతరం అక్కడి రాజకీయ పరిస్థితులు రాజేష్‌కు అనుకూలంగా లేవని తేలింది. దీంతో రాజేష్ పోటీ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. రాజేష్ అంగీకారం తర్వాతే టిక్కెట్‌ను జనసేనకు కేటాయించారని ప్రచారం జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ మొత్తం 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది.