PAWAN KALYAN: జనసేన మచిలీపట్నం అభ్యర్థిగా బాలశౌరి.. మరో రెండు స్థానాలు పెండింగ్
ఈ స్థానం నుంచి వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తాజాగా ప్రకటన వెల్లడైంది. ఎన్డీయే కూటమిలో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఏపీలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
PAWAN KALYAN: మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయబోయే అభ్యర్థిని ప్రకటించింది జనసేన. ఈ స్థానం నుంచి వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తాజాగా ప్రకటన వెల్లడైంది. ఎన్డీయే కూటమిలో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఏపీలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్తానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతుంది.
April 1: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ట్యాక్సుల నుంచి ఇన్సూరెన్స్ దాకా.. మారబోతున్నవి ఇవే..
వీటిలో రెండు అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన వాటికి జనసేన అభ్యర్థుల్ని ఖరారు చేసింది. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్ పేరును ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా మచిలీపట్నం ఎంపీ స్థానానికి అభ్యర్థిగా బాలశౌరిని ఖరారు చేశారు. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం జనసేన సర్వే చేయిస్తోంది. ఈ సర్వే ఆధారంగా అభ్యర్థుల్ని ప్రకటిస్తామని జనసేన ప్రకటించింది. మరోవైపు పవన్.. తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంలో శనివారం నుంచి పర్యటిస్తున్నారు. ఆయన ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అభిమానులు, జనసేన, టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి.
అలాగే పిఠాపురం టీడీపీ నేత వర్మ కూడా పవన్‌ను కలిశారు. దాదాపు ఐదు రోజులు పవన్ పిఠాపురంలో పర్యటిస్తారు. ఇక.. పొత్తులో భాగంగా 175 సీట్లకుగాను టీడీపీ 144 మంది అసెంబ్లీ, 17 ఎంపీ స్తానాల్లో, బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో, జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నాయి.