JANASENA: పవన్‌పై జగన్ కామెంట్స్.. ఈసీకి జనసేన ఫిర్యాదు..
ఈనెల 16న భీమవరంలో జరిగిన సభలో పవన్‌పై జగన్ అసభ్యకరంగా కామెంట్స్ చేశారని జనసేన తన ఫిర్యాదులో పేర్కొంది. సభలో పవన్ వ్యక్తిగత జీవితం, మూడు పెళ్లిళ్లపై జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా రోడ్ షోలో ప్రసంగించా

JANASENA: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శుక్రవారం, ఏపీ ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి జనసేన ఏపీ ప్రధాన కార్యదర్శి తమ్మారెడ్డి శివశంకర్‌రావు ఫిర్యాదు చేశారు.
AP ELECTIONS: ఇవీ వీళ్ల ఆస్తులు.. బాలయ్యకు ఇల్లు లేదు.. చంద్రబాబుకు కారు లేదు
ఈనెల 16న భీమవరంలో జరిగిన సభలో పవన్‌పై జగన్ అసభ్యకరంగా కామెంట్స్ చేశారని జనసేన తన ఫిర్యాదులో పేర్కొంది. సభలో పవన్ వ్యక్తిగత జీవితం, మూడు పెళ్లిళ్లపై జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా రోడ్ షోలో ప్రసంగించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధంగా మాట్లాడిన జగన్.. తద్వారా రాష్ట్రంలోని మహిళలను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి మాటలతో ఎన్నికల వాతావరణం కలుషితం అవుతుందని, జగన్ సానుభూతితో మళ్లీ గెలవాలని ప్రయత్నిస్తున్నారని జనసేన నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. సీఎం వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది.
ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులను భయాభాంత్రులకు గురిచేస్తోందని జనసేన ఫిర్యాదు చేసింది. పవన్ కళ్యాణ్‌పై జగన్ చేసిన వ్యాఖ్యల విషయంలో సీఈఓ మీనా వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకుంటారనే నమ్మకం తమకు ఉందని శివశంకర్ రావు అన్నారు.