JANASENA GLASS: ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు.. హైకోర్టులో జనసేన పిటిషన్
ఇప్పటికే 60కిపైగా ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు కేటాయించింది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భారీ నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్లాసు గుర్తును ఎవరికీ కేటాయించకూడదంటూ జనసేన ఈసీని కోరింది.

JANASENA GLASS: టీడీపీ, జనసేన కూటమికి గ్లాసు గుర్తు టెన్షన్ పట్టుకుంది. జనసేనకు గ్లాస్ గుర్తును కామన్ సింబల్‌గా కేటాయించినప్పటికీ.. జనసేన పోటీలో లేని చోట్ల ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు కేటాయిస్తోంది ఈసీ. ఇప్పటికే 60కిపైగా ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు కేటాయించింది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భారీ నష్టం కలిగే అవకాశం ఉంది.
KCR: సామాన్యుడితో సామాన్యుడిలా కేసీఆర్.. గులాబీ బాస్ అహంకారం దిగినట్లేనా..
ఈ నేపథ్యంలో గ్లాసు గుర్తును ఎవరికీ కేటాయించకూడదంటూ జనసేన ఈసీని కోరింది. అయినప్పటికీ గ్లాస్ సింబల్ ఫ్రీ సింబల్స్ లిస్టులో ఉండటంతో ఈసీ ఇండిపెండెంట్లకు కేటాయిస్తోంది. ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించొద్దంటూ జనసేన తన పిటిషన్‌లో కోరింది. ఈ గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి వినతి పత్రం ఇచ్చామని జనసేన కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇప్పటికే దీనిపై రెండోసారి వినతిపత్రం ఇచ్చినా ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉన్నందువల్ల జనసేన పోటీలో లేని చోట.. కూటమికి నష్టం కలుగుతుందని జనసేన తన పిటిషన్‌లో పేర్కొంది.
ఈ అంశంపై స్పందించిన ఈసీ.. 24 గంటల్లోగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలిపింది. ఈసీ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌లో తన వాదన వినిపించేందుకు టీడీపీ కూడా అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఏ పార్టీకైనా కామన్ సింబల్ రావాలంటే పోలైన ఓట్లలో 6 శాతం ఓట్లు సాధించాలి. కనీసం 2 సీట్లు గెలవాలి.