Pawan Kalyan: జనసేనలోకి భారీగా చేరికలు.. కీలక నేతల రాకతో బలం పెరుగుతుందా..?
త్వరలోనే ఇద్దరు మాజీ మంత్రులు, వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఈనెల 27న మాజీ మంత్రి, మాజీ ఎంపీ కొణతాల రామక్రిష్ణ, 30న మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఫిబ్రవరి 2న వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరబోతున్నారు.

Pawan Kalyan: ఎన్నికల వేళ జనసేనకు కలిసొస్తున్నట్లే కనిపిస్తోంది. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, సినీ ప్రముఖులు వరుసగా పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే కొందరు జనసేన కండువా కప్పుకోగా.. మరికొందరి చేరికకు ముహూర్తం ఖరారైంది. బుధవారం సినీ నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ.. తన ఫ్యామిలీతో కలిసి పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా పవన్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకొన్నారు.
Hyderabad: పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. మహిళలు అరెస్టు..
త్వరలోనే ఇద్దరు మాజీ మంత్రులు, వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఈనెల 27న మాజీ మంత్రి, మాజీ ఎంపీ కొణతాల రామక్రిష్ణ, 30న మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఫిబ్రవరి 2న వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరబోతున్నారు. వీరందరి చేరికతో జనసేన బలం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి పార్టీ పెట్టి పదేళ్లైనా.. కీలక నేతల్ని పవన్ తన పార్టీలో చేర్చుకోలేదు. ఈ అంశంపై పవన్ పెద్దగా దృష్టి సారించలేదు. లేకుంటే పార్టీ పరిస్థితి మరోలా ఉండేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే, ఎన్నికల సమయంలో పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరుతుండటం ఆ పార్టీకి కలిసొస్తుందని అంచనా. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. పొత్తు ఖరారైనప్పటికీ.. సీట్ల విషయం తేలాల్సి ఉంది.
మరోవైపు.. వైసీపీలో టిక్కెట్లు దొరకని నేతలంతా ఇప్పుడు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. పలువురు సిట్టింగులకు జగన్ టిక్కెట్లు నిరాకరిస్తున్నారు. దీంతో వీళ్లంతా టీడీపీ, జనసేన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో ఆయా పార్టీల్లో జోష్ కనిపిస్తోంది. ఇదే సమయంలో టిక్కెట్ల కోసం పోటీ కూడా పెరుగుతోంది. మరి ఈ పరిస్థితిని ఆయా పార్టీలు ఎలా అధిగమిస్తాయో చూడాలి.