JANASENA: జనసేనకు ఈసీ భారీ షాక్‌.. పవన్ సైకిల్ గుర్తుపై పోటీ చేయాల్సిందేనా..?

ఈ మధ్య గాజు గ్లాసుని తమకే కేటాయించారంటూ జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే, ఎన్నికల వేళ విడుదలైన ఈసీ గెజిట్ నోటిఫికేషన్ ఆ పార్టీకి షాకిచ్చేలా ఉంది. మరి ఈ గుర్తుకోసం పవన్ పోరాటం చేస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2024 | 02:05 PMLast Updated on: Apr 02, 2024 | 2:05 PM

Janasena Party Facing Issue With Glass Symbol Ec Announced It Free Symbol

JANASENA: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. జనసేనకు భారీ షాక్ తగిలింది. పవన్ పార్టీని ఎన్నికల సంఘం కేవలం రిజిస్టర్డ్‌ పార్టీగానే గుర్తించింది. గుర్తింపు పొందిన పార్టీల లిస్టులో జనసేనకు చోటివ్వలేదు. ఏపీ నుంచి కేవలం వైసీపీ, టీడీపీ మాత్రమే గుర్తింపు పొందిన పార్టీలని.. వాటికి మాత్రమే గుర్తులు కేటాయించినట్టు ఈసీ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గాజు గ్లాసు గుర్తుని ఫ్రీ సింబల్‌గా ఈసీ తెలపడంతో.. పవన్‌కు భారీ షాక్ తగిలినట్లు అయింది.

Urvashi Rautela: నా హైట్ కూడా లేరు.. పంత్‌ను మళ్లీ టార్గెట్ చేసిన ఊర్వశి

ఈ మధ్య గాజు గ్లాసుని తమకే కేటాయించారంటూ జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే, ఎన్నికల వేళ విడుదలైన ఈసీ గెజిట్ నోటిఫికేషన్ ఆ పార్టీకి షాకిచ్చేలా ఉంది. మరి ఈ గుర్తుకోసం పవన్ పోరాటం చేస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు గాజు గ్లాసు గుర్తు తమదేనంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానంలో పోరాటం చేస్తోంది. ఈ విచారణలో గాజు గ్లాసు ఏ పార్టీకి వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక గుర్తుకు సంబంధించి జనసేన నేతలు.. న్యాయవాదులతో సుధీర్ఘ చర్చలు జరుపుతున్నారు. నిజానికి జనసేనకు ఈ పరిస్థితి రావడానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయ్. పార్టీకి గుర్తింపు ఉండాలన్నా, ఓ గుర్తు ఉండాలన్నా.. ఎన్నికల్లో పోటీ చేయాలి. ఈసీ నియమావళి ప్రకారం ఓటింగ్ శాతం ఉండాలి.

ఐతే జనసేన చాలా ఎన్నికలను వదిలేస్తూ వచ్చింది. గత ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెలుచుకుంది. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే కూడా చేజారారు. ఇలాంటి పరిస్థితుల్లో పదే పదే గాజు గ్లాసు ఫ్రీ సింబల్స్ లిస్ట్‌లో కనిపిస్తోంది. ఇప్పుడీ ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పోటీ చేయని మిగతా చోట్ల కూటమికి తీవ్ర ఇబ్బందులు ఎదురవక తప్పదు.