Pawan Kalyan: పొత్తులపై పవన్ మళ్లీ యూటర్న్.. అసలు వ్యూహం వేరే ఉందా ?
ఈసారి ప్రయోగాలు చేయబోమని.. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఎంత దూరం అయినా వెళ్తా.. ఎంతవరకైనా తగ్గుతా అని.. అప్పట్లో పవన్ చేసిన వ్యాఖ్యలు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. కట్ చేస్తే.. ఆ మాటలు మర్చిపోయినట్లు బిహేవ్ చేస్తున్నాడు పవన్. టీడీపీని, బీజేపీని కలిపేందుకు ప్రయత్నాలు చేసినట్లే కనిపించినా.. పెద్దగా సక్సెస్ కాకపోవడంతో.. మళ్లీ సైలెంట్ అయ్యారు.

Pawan Kalyan Political Strategy
ఇక వారాహి యాత్ర మొదలుపెట్టారు. ఇప్పుడైనా పొత్తుల గురించి క్లారిటీ ఇస్తారా అంటే.. మళ్లీ అదే కన్ఫ్యూజన్. సింగిల్‌గా వస్తానో.. పొత్తులతో వస్తానో తెలియదు అంటూ.. ప్రతీచోట పవన్ చెప్తున్న మాటలు.. ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. పవన్ గందరగోళంలో పడిపోయాడా.. బీజేపీకి భయపడే ఇలాంటి మాటలు అంటున్నారా.. అంటే కానే కాదు.. అంతకుమించి వ్యూహం ఉందంటున్నాయ్ రాజకీయవర్గాలు. టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత కాపు వర్గాల్లో కాస్త అసంతృప్తి మొదలైంది. ఇది గ్రహించే వారాహి యాత్రలో పవన్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది.
ఎంత కాదు అన్నా.. అలాంటిదేమీ లేదు అన్నా.. జనసేన అనేది కాపుల పార్టీ. కాపులు ఓన్ చేసుకున్న పార్టీ. అలాంటి సామాజికవర్గానికి దూరం అయితే మొదటికే మోసం వస్తుందని పవన్ గ్రహించారు. అందుకే పొత్తుల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదనిపిస్తోంది. ఏపీలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. వైసీపీ మీద వ్యతిరేకత ఉంది.. అదే సమయంలో టీడీపీ మీద సింపథీ కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఆ రెండు పార్టీలకు సమానంగా సీట్లు వస్తే.. జనసేన కీ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే కర్ణాటకలో గత ఎన్నికల్లో జేడీఎస్‌లాగా అన్నమాట. అదే జరిగితే.. సీఎం అయ్యేందుకు కూడా అవకాశాలు ఉంటాయ్.
ఇవన్నీ ఆలోచించే పవన్ పొత్తుల విషయంలో సైలెంట్‌గా ఉంటున్నారా అంటే.. కాదు అనడానికి అయితే లేదు. పైగా పొత్తులు లేవు.. పొత్తులు పెట్టుకోవడానికి ఆసక్తిగా లేము అనే ప్రచారాన్ని తీసుకురావడం ద్వారా.. టీడీపీని ఒత్తిడిలోకి నెట్టేసి.. ఎక్కువ సీట్లు తీసుకోవచ్చు అనే వ్యూహం కూడా పవన్ మాటల్లో కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఏమైనా పొత్తుల విషయంలో ఇప్పటికిప్పుడు ఓ నిర్ణయానికి రాకుండా.. వేచిచూసే ధోరణితో ఉండాలని పవన్ కనిపిస్తున్నారు. అందుకే ఓ సభలోనూ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదే నిజం అయితే.. వారాహి యాత్రలో పవన్ నుంచి మరిన్ని విచిత్రాలు వినడం ఖాయం అంటున్నాయ్ రాజకీయవర్గాలు.