Janasena Pawan Kalyan Tweet: జగన్ పై పవన్ వ్యంగాస్త్రాలు..!

PAWAN KALYAN TWEET ON YS JAGAN
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ చేస్తున్న అప్పులు సరికొత్త రికార్డులు సృష్టించే స్థాయికి చేరుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత 9 నెలల కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ. 55వేల 555 కోట్లకు చేరుకుందని మండిపడ్డారు. ఏపీ పేరు అప్పులతో మారుమోగిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పినట్లు వ్యంగాస్త్రాలు సంధించారు. ఇలాగే అప్పుల ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని కొనసాగించాలని చురకలు విసిరారు. మీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం మాత్రం మర్చిపోవద్దని ఎద్దేవాచేశారు.
అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍
P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊#AppuRatnaAPCM pic.twitter.com/bnZEOHdMFa— Pawan Kalyan (@PawanKalyan) February 7, 2023
ఆంధ్ర రాష్ట్రం అభివృద్దిని, సంపదను వదిలేయండి. భారతరత్న లాగా మీకు కూడా అప్పురత్న అవార్డు ఇవ్వాలని తనదైన శైలిలో విమర్శించారు. గతంలో కూడా జనసేనాని ఈ తరహాలో మండిపడ్డారు. ధనిక వ్యక్తి సీఎంగా పరిపాలిస్తున్న రాష్ట్రం పేదరికంలో కూరుకుపోయిందని ఆరోపించారు. దేశంలోని అన్ని ముఖ్యమంత్రులకన్నా మన సీఎం సంపాదనే ఎక్కువ అని ధ్వజమెత్తారు.