Bumra: జూనియర్ బుమ్రా వచ్చేశాడు పేరు కొత్తగా పెట్టిన భార్య
భారత క్రికెట్ జట్టు ప్రసిద్ద బౌలర్ బుమ్రా తండ్రయ్యాడు.

Jasprit Bumrah's birth of a baby boy was posted on social media
టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. ఆయన భార్య సంజనా గణేశన్ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఆనందకర విషయాన్ని బుమ్రా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఓ ఫొటో షేర్ చేశాడు. ‘‘మా చిన్న కుటుంబం పెరిగింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. ఈ రోజు ఉదయం మా చిన్నారి అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం.
ఇప్పుడు మా ఆనందానికి అవధుల్లేవు. తల్లిదండ్రులుగా మా జీవితాల్లో ప్రారంభమైన ఈ కొత్త అధ్యాయాన్ని ప్రతిక్షణం ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని బుమ్రా ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా బుమ్రా దంపతులు చిన్నారి చేతిని పట్టుకున్న ఫొటోను పంచుకున్నాడు. దీంతో బుమ్రా దంపతులకు తోటి క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్రికెటర్లు సూర్య కుమార్ యాదవ్, దినేశ్ కార్తిక్, రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే, యువరాజ్ సతీమణి హజెల్ కీచ్ తదితరులు బుమ్రాకు శుభాకాంక్షలు తెలిపారు.