JD Lakshminarayana: టార్చ్‌లైట్.. జేడీ పార్టీకి కేటాయించిన గుర్తు ఇదే..
అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్ధులకు కామన్ సింబల్ కేటాయించటంపై ఈసీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటన విడుదల చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు.

JD Lakshminarayana: సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్‌ను ఎన్నికల సంఘం కేటాయించింది. వీవీ లక్ష్మీనారాయణ సారథ్యంలోని జైభారత్ నేషనల్ పార్టీకి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్ సింబల్‌గా టార్చిలైట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్ధులకు కామన్ సింబల్ కేటాయించటంపై ఈసీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటన విడుదల చేశారు.
BJP MP’S: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మాజీ సీఎంలు.. ఈసారైనా గెలుస్తారా..!
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంత పార్టీ స్థాపించారు. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థిగా తాను విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష్మీనారాయణ పోటీ చేయబోతున్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు.. జగన్, గాలి జనార్దన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ సందర్భంగా లక్ష్మీనారాయణ అందరికీ దగ్గరయ్యారు. ఓ దశలో జగన్ యాంటీ మీడియాకు లీకులు ఇస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక 2018లోనే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో ఏపీలోని విశాఖపట్టణం నుంచి జనసేన తరఫున ఎంపీగా బరిలో దిగి పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి ఆ పార్టీకి దూరం జరిగారు.
కొన్నాళ్ల కిందట జైభారత్ నేషనల్ పార్టీని ప్రారంభించారు. ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు తన ఆదర్శ భావాలను యువత, విద్యార్థులకు చేరవేసేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నించారు. నిరాశలో ఉన్నవారికి దారి చూపే దీపంగా కనిపించేవారని.. అలాంటి వ్యక్తి పెట్టిన పార్టీకి వెలుగుతున్న టార్చిలైట్ గుర్తు రావడం శుభపరిణామం అంటూ ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు.