Jill Biden Kiss To Doug Emhoff: ఉపాధ్యక్షురాలి భర్తను ముద్దులాడిన అమెరికా దేశ అధ్యక్షుడి భార్య..!

AMERICA KISSING INSIDENT
మనదేశంలో అమ్మాయి వేరొక అబ్బాయితో లేదా అబ్బాయి వేరొక అమ్మాయితో కలిసి తిరిగితే తప్పుగా చూస్తుంది సమాజం. వారిద్దరి మధ్య స్నేహపూరితమైన వాతావరణం మాత్రమే ఉండవచ్చు అయినా తప్పుగానే చూస్తుంది. ఇక వేకొకరి భార్య మరో పెళ్లైన మగాడికి ముద్దుపెడితే ఎలా ఉంటుంది. ఇక ఆ సంసారంలో రావణకాష్టం రగిలినట్టే. అదే మన దేశ సంస్కృతి. అయితే ఇక్కడ అలాంటి వింతే చోటు చేసుకుంది.
ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా. ఈ దేశ అధ్యక్షుడు జో బైడెన్ (joe Biden) భార్య జిల్ బైడెన్ (Jill Biden) చేసిన చర్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harri) భర్త డగ్లస్ ఎమహాఫ్ (Doug Emhoff )ను జిల్ బైడెన్ (Jill Biden) పెదవులకు తాకించి ముద్దుపెట్టారు. అయితే కమలా హారిస్ (Kamala Harri) మన దేశంలోనే పుట్టిపెరిగినప్పటికీ. అమెరికన్ ను పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. అత్యున్నత స్థానానికి ఎదిగారు. ఇలాంటి వాటిని అక్కడ చాలా చిన్న అంశంగా పరిగణిస్తారని చెప్పుకోవాలి. ఇలా ఆ దేశ అధ్యక్షుడి భార్య.. ఉపాధ్యక్షురాలి భర్తను ముద్దులాడే సంఘటన క్యాపిట్ హిల్‌లో జరిగిన సమావేశం చోటు చేసుకుంది.
Did Jill Biden just kiss Kamala’s husband on the LIPS?! pic.twitter.com/KvrUxSI8Lu
— Benny Johnson (@bennyjohnson) February 8, 2023
ఇందుకు సంబంధించిన వీడియోను అమెరికన్ జర్నలిస్ట్ బెన్నీ జాన్సన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘జిల్ బైడెన్ కమలా హ్యారిస్ భర్తను లిప్స్‌పై ముద్దు పెట్టుకున్నారా..?’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (joe Biden) ఉభయసభలను ఉద్దేశించి మంగళవారం రాత్రి గంటా 15 నిమిషాలు ప్రసంగించారు. స్టేట్ ఆఫ్ ద యూనియన్‌లో రెండవసారి బైడెన్ మాట్లాడారు. ఇందులో చైనాకు పరోక్షంగా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తమ సార్వభౌమత్వానికి చైనా నుంచి ప్రమాదం పొంచి ఉంటే, అప్పుడు దేశాన్ని రక్షించుకునేందుకు సరైన రీతిలో స్పందిస్తామని అన్నారు. దానికి తగినట్లే వ్యవహరిస్తామని తెలిపారు. గత శనివారం చైనా నిఘా బెలూన్‌ను పేల్చివేసిన విషయాన్ని ఈ సందర్భంగా పరోక్షంగా చెప్పుకొచ్చారు.