Jio Annual OTT Plans: ఓటీటీ వినోదాన్నందించేందుకు ఏడాది ప్లాన్స్ తో సిద్దమైన జియో..
అన్ లిమిటెడ్ కాల్స్, అపరిమిత డేటా, ఏడాది వ్యాలిడిటీతో సరికొత్త ఆఫర్లను ప్రకటించిన జియో.
నేటి సమాజంలో ఓటీటీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా ప్లాన్స్ ను రూపొందింస్తున్నారు. కస్టమర్ ని ఆకర్షించి తక్కువ ధరలతో వినోదాన్ని అందించేందుకు సిద్దమవుతున్నాయి దిగ్గజ టెలికాం కంపెనీలు. మన్నటి వరకూ ఎయిర్ టెల్ నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ మాధ్యమాలను అందిస్తూ కొంత డేటా రుసుమును పెంచింది. అలాగే యాక్ట్ ఫైబర్ కూడా అన్ని ఓటీటీ వేదికలను ఒకేచోట చేర్చి సరికొత్త ప్యాకేజీని అందిస్తోంది. ఈ కోవలోకి దిగ్గజ సంస్థ జియో కూడా అడుగు పెట్టింది. తొలి ప్రయోగంతోనే కోట్ల మంది సామాన్య వినియోగదారులను ఆకర్షించేలా ప్రణాళికలు రచించింది. అందులో భాగంగానే సరికొత్త ప్లాన్లను, వాటి ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం కాల్స్ రీచార్జ్ చేసుకుంటే చాలు ఉచితంగా ఓటీటీ ప్రసారాను వీక్షించే ప్రయోజనాన్ని కల్పిస్తూ ఈ ప్యాకేజీని ప్రకటించింది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఏడాది ప్లాన్స్ ఇవే..
రెండు ఓటీటీ మాధ్యమాలు..
సోనీలివ్, జీ5 సబ్ స్క్రిప్షన్ ప్లాన్
దీని ధర రూ. 3662
వ్యాలిడిటీ – 365 రోజులు
అన్ లిమిటెడ్ కాల్స్
రోజుకు 2.5 జీబీ డేటా
100 ఎస్ఎమ్ఎస్ రోజుకు
జియో టీవీ, జియో సినిమాస్, జియో క్లౌడ్ పొందవచ్చు
సింగల్ ఓటీటీ మాధ్యమం
కేవలం సోనీలివ్ సబ్ స్క్రిప్షన్
దీని ధర రూ. 3226
వ్యాలిడిటీ – 365 రోజులు
అన్ లిమిటెడ్ కాల్స్
రోజుకు 2 జీబీ డేటా
100 ఎస్ఎమ్ఎస్ రోజుకు
జియో టీవీ, జియో సినిమాస్, జియో క్లౌడ్ పొందవచ్చు
సింగల్ ఓటీటీ మాధ్యమం
కేవలం జీ5 సబ్ స్క్రిప్షన్
దీని ధర రూ. 3225
వ్యాలిడిటీ – 365 రోజులు
అన్ లిమిటెడ్ కాల్స్
రోజుకు 2 జీబీ డేటా
100 ఎస్ఎమ్ఎస్ రోజుకు
జియో టీవీ, జియో సినిమాస్, జియో క్లౌడ్ పొందవచ్చు
నాన్ ఓటీటీ ప్లాన్
జియో టీవీ, జియో సినిమాస్, జియో క్లౌడ్ మాత్రమే ఉంటాయి
దీని ధర రూ. 2999
వ్యాలిడిటీ – 365 రోజులు
అన్ లిమిటెడ్ కాల్స్
రోజుకు 2 జీబీ డేటా
100 ఎస్ఎమ్ఎస్ రోజుకు
సామాన్యులను ఆకట్టుకునేందుకు ఈ ప్రత్యేక ఆఫర్లను దసరా కానుకగా అందించనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఎంత కాలం పాటు కొనసాగిస్తారన్న విషయాన్ని సంస్థ ఎక్కడా ప్రకటించలేదు. దీర్ఘకాలం అందుబాటులో ఉంచవచ్చు లేదా తొలగించవచ్చు. తొలగించిన సమయంలో సబ్ స్క్రిప్షన్ తీసుకుని ఉంటే వారికి ఎలాంటి ఆటంకం లేకుండా ప్లాన్ సేవలను నిర్విరామంగా పొందవచ్చు.
T.V.SRIKAR