Jio Bharath 4G: రూ. 999 కే సెల్ ఫోన్.. భారత్ జియో ఫోన్ 4జీ ఫీచర్లు ఇవే..!
సెల్ ఫోన్ రంగంలో చరిత్ర సృష్టిస్తున్న ప్రముఖ టెలికాం సంస్థ జియో రూ. 999 కే సెల్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
నీటితో పెట్టుకుంటే మునిగిపోతావ్.. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావ్.. కానీ జియోతో పెట్టుకుంటే పతనమైపోతావ్. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందటే.. తాజాగా జియో భారత్ 4జి ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. కేవలం రూ. 999 కే అమెజాన్ వేదికపై అమ్మకాలు జరిపేందుకు సిద్దమైంది. నేటి తరంలో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల ప్రజలు 2జీ ఫోన్లను వాడుతూ ఉంటారు. వారిని దృష్టిలో ఉంచుకొని ఈ ఫోన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లో మొత్తం 23 భాషల్లో వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ ఫోన్లో కార్భన్ సహాయంతో పనిచేసే బ్యాటరీని అమర్చినట్లు తెలిపింది జియో.
ఈ ఫోన్ ను రానున్న రోజుల్లో ఇతర మొబైల్ షాపుల్లో అందుబాటులోకి తీసుకొస్తుందా లేదా అన్న విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ ఆవిష్కరించిన సందర్భంగా స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. కేవలం రూ. 123 తో 28 రోజుల ప్రారంభ రీచార్జ్ ప్లాన్ తీసుకున్న వాళ్లకి అపరిమిత కాల్స్ తో పాటూ 14 జీబీ డేటాను అందిస్తుంది. జియో స్ట్రీమింగ్ చేసే యాప్ లతో అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.
జియో భారత్ 4జీ ఫీచర్లు ఇవే..
- 1000 ఎంఏహెచ్ బ్యాటరీ,
- 3.0 మెగా పిక్సల్ కెమెరా
- ఎల్ఈడీ ఫ్లాష లైట్
- 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్
- 1.77 అంగుళాల డిస్ ప్లే
- మైక్రో ఎస్ డీ కార్డ్ పోర్ట్
- 128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ
- డ్యూయల్ సిమ్ ట్రే
T.V.SRIKAR