Jio with Netflix: జియో ప్రీ-పెయిడ్ కస్టమర్లకు నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్.. ప్లాన్ వివరాలు ఇవే
దేశంలోనే టెలికాం రంగంలోతనదైన మార్క్ వేసుకొని దూసుకుపోతోంది జియో. ప్రతి నెల ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది ఈ సంస్థ. మన్నటి వరకూ లాప్ టాప్ లు తక్కువ ధరకు తీసుకొచ్చిన జియో తాజాగా నెట్ ఫ్లిక్స్ తో భాగస్వామ్యం అయింది. ఇక నుంచి జియో యూజర్లకు నెట్ల ఫ్లిక్స్ ద్వారా వినోదాన్ని పంచేందుకు సిద్దమైంది.
ఈ సందర్భంగా జియో సంస్థల సీఈఓ కిరణ్ థామస్ ఓ ప్రకటన చేశారు. మా వినియోగదారులకు ప్రపంచ స్థాయి సర్వీసులు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అందులో భాగంగానే జయో ప్రీ పెయిడ్ వినియోగదారులకు ఆకర్షణీయమైన నెట్ ఫ్లిక్స్ ప్లాన్ తో ముందుకు వచ్చామన్నారు. గతంలో జియో పోస్ట్ పెయిడ్, జియో ఫైబర్ యూజర్లకు నెట్ ఫ్లిక్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ సేవలను ప్రీ పెయిడ్ కస్టమర్లక ఇప్పటి వరకూ అందుబాటులో లేదు. అందుకే ఇప్పుడు వారికి కూడా వినోదాన్ని తక్కువ ధరకు అందించేందుకు సరికొత్త ప్లాన్లను రూపొందించినట్లు వివరించారు. ఈ ప్రకటనతో దాదాపు 40 కోట్ల మంది జియో ప్రీ పెయిడ్ కస్టమర్లకు నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రీప్షన్ అందుబాటులోకి రానుంది.
ప్లాన్ వివరాలు ఇలా..
- జియో ప్రీ పెయిడ్ వినియోగదారులకు 84 రోజుల కాలపరిమితితో ఒక ప్లాన్ ను తీసుకువచ్చింది.
- సాధారణంగా 84 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం వాయిస్ కాల్స్, మెసేజ్లు, ప్రతి రోజూ 2 జీబీ ప్లాన్ ధర రూ. 719, 3 జీబీ ప్లాన్ అయితే రూ. 999 గా ఉండేది.
- ఇప్పుడు వీటికి ప్రత్యేకంగా నెట్ ఫ్లిక్స్ సేవలను జోడించడం వల్ల ప్లాన్ ధరల్లో కాస్త మార్పులు చేసింది.
- ఇందులో రెండు రకాలు ఉన్నాయి. 1. మొబైల్ సబ్ స్క్రిప్షన్. 2. టీవీ సబ్ స్క్రిప్షన్
- రూ. 1,099 తో రీచార్జ్ చేసుకుంటే నెట్ ప్లిక్స్ మెబైల్ సబ్ స్క్రిప్షన్, అన్ లిమిటెడ్ 5జీ డేటా లేదా రోజుకు 2 జీబీ 5 జీ డేటాతో పాటూ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయి.
- రూ. 1,499 తో రీచార్జ్ చేస్తే వినియోగదారుల మొబైల్ తోపాటూ టీవీలో కూడా నెట్ ఫ్లిక్స్ సేవలను వినియోగించుకోవచ్చు. అన్ లిమిటెడ్ 5జీ డేటా లేదా 3 జీబీ 4జీ డేటా తోపాటూ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయి.
- అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ వినోదాన్ని మొబైల్ లో మాత్రమే చూసేందుకు ప్రత్యేకంగా రూ. 149 తో నెలవారీ రీచార్జ్ చేయాలి. దీంతో నెల మొత్తం నెట్ ఫ్లిక్స్ కంటెంట్ ను వీక్షించవచ్చు.
T.V.SRIKAR