Jio Vs Airtel: ఎయిర్‌టెల్ Vs జియో.. వేడెక్కనున్న ఎయిర్‌ఫైబర్ వార్..
జియో మరో సంచలనానికి తెరదీయబోతోంది. టెల్కో నుంచి టెక్ కోగా మారుతున్న జియో... భారతీయులందరికీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను చేరువ చేసే పనిలో పడింది. దీంతోపాటు ఎయిర్ ఫైబర్ వార్‌ను మరింత వేడెక్కించబోతోంది.
జియో మరో సంచలనానికి తెరదీయబోతోంది. టెల్కో నుంచి టెక్ కోగా మారుతున్న జియో.. భారతీయులందరికీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను చేరువ చేసే పనిలో పడింది. దీంతో పాటు ఎయిర్ ఫైబర్ వార్‌ను మరింత వేడెక్కించబోతోంది.
కాస్త లేటైనా లేటెస్టుగా వస్తానంటోంది రిలయన్స్ జియో.. ఇప్పటికే ఎయిర్‌టెల్ ఎయిర్ ఫైబర్‌ను లాంచ్ చేసింది. కొన్ని నగరాల్లో దాన్ని టెస్ట్ చేస్తోంది. దానికి పోటీగా జియో కూడా వినాయకచవితి నుంచి ఎయిర్ ఫైబర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటివరకు మనకు ఉన్న ఇంటర్నెట్ అంతా వైర్డ్ నెట్.. జియో అయినా ఎయిర్‌టెల్ అయినా ఇంకోటైనా అంతా అంతే. దానికోసం నానా తంటాలు పడాల్సి వచ్చేది. వైర్లు తెగిపోతే మరో సమస్య. అన్ని కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యే ఇది. దీనికి పరిష్కారమే ఎయిర్ ఫైబర్. వైర్ లేకుండానే నెట్ అందించచ్చు. ఇంటర్నెట్ డైరెక్ట్ టు హోమ్ అన్నమాట. ఓ చిన్న డివైజ్ పెట్టుకుంటే చాలు. నెట్ మన ఇంట్లో ఉన్నట్లే. మనకు కావాలంటే అటూ ఇటూ మార్చుకోవచ్చు. ఎలాంటి వైర్లు లేకుండా నెట్ వాడుకోవచ్చు. ఈ దిశగా జియో, ఎయిర్‌టెల్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
జియో ఎయిర్‌ఫైబర్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. తక్కువ సమయంలోనే 20కోట్ల ఇళ్లకు చేరాలన్నది లక్ష్యం. రిలయన్స్ ఏజీఎంలో ఇదే విషయాన్ని చెప్పారు ముఖేష్ అంబానీ. అంతేకాకుండా ఇప్పటివరకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సామాన్యులకు అందుబాటులో లేదు. దీన్ని అందరికీ చేరువ చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లు వివరించారు. జియో విస్తరణ, జియో భారత్ ఫోన్లు, జియో ఎయిర్‌ఫైబర్, జియో బిజినెస్ సెగ్మెంట్.. ఇలా నాలుగు అంశాలపై ఫోకస్ పెట్టనున్నట్లు వివరించారు.
ఏడేళ్ల క్రితం జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కాల్స్, డేటా అంతా కాస్ట్లీగా ఉన్న సమయంలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పోటీ కంపెనీలను తొక్కేస్తూ అతి తక్కువ ధరకే డేటా అందిస్తూ ఇండియాస్ నెంబర్ వన్ టెల్కోగా ఎదిగింది. మిగిలిన కంపెనీలను కూడా నేలకు దించింది. అప్పుడు అందరికీ బ్రాడ్‌బ్యాండ్ అందిస్తామన్న హామీని నిలబెట్టుకున్నామన్న ముఖేష్ అంబానీ.. ఇప్పుడు అందరికీ ఏఐ అంటున్నారు. దాన్ని నిలబెట్టుకుంటామని గట్టిగా చెబుతున్నారు. జియోలో ఏఐను పూర్తిస్థాయిలో వినియోగించడం ద్వారా కస్టమైజ్డ్ సేవలు అందించడమే కాకుండా కాస్ట్‌ను కూడా తగ్గించొచ్చన్నది ఆలోచన.
జియో ఫైబర్ ద్వారా ప్రస్తుతం రోజుకు 15వేల కనెక్షన్లు ఇవ్వగలుగుతున్నారు. అదే ఎయిర్ ఫైబర్ అయితే ఏకంగా లక్షన్నర కనెక్షన్లను సునాయాసంగా ఇవ్వొచ్చు. ఈ సామర్ధ్యం రానున్న మూడేళ్లలో మార్కెట్‌లో కంపెనీని నెంబర్ వన్‌గా నిలబెడుతుందని జియో ఆశిస్తోంది. ఖర్చు తక్కువ.. రాబడి ఎక్కువ ప్రస్తుతం జియో పాలసీ. అదే సమయంలో కస్టమర్ల సేవలపై ఎలాంటి రాజీ పడకూడదు. అంతేకాకుండా త్వరలో జియో ట్రూ 5జీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయబోతోంది. టెక్నాలజీ పార్ట్‌నర్స్‌తో కలిసి ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్స్ డెవలప్ చేయాలన్నది జియో ఆలోచన. ఈ ఏడాది చివరకు దేశమంతా 5జీని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే దేశంలోని 96శాతం నగరాలకు దీన్ని విస్తరించింది. 5కోట్ల మంది 5జీ కస్టమర్లు జియోకు ఉన్నారు. జియోకు మొత్తం 45కోట్లకుపైగా కస్టమర్లున్నారు.
ఎయిర్‌టెల్ ఎయిర్ ఫైబర్ అందుబాటు ధరలోనే లాంచ్ చేయనుంది. జియో దానికంటే కాస్త తక్కువ ధరకే మరిన్ని సౌకర్యాలతో మార్కెట్‌ను ముంచెత్తాలని భావిస్తోంది.