TG New Governor Jishnudev Verma : తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం..
తెలంగాణ నాలుగోవ గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం చేశారు. జిష్ణుదేవ్ వర్మ 1957 అగస్ట్ 15న జన్మించారు. రామజన్మభూమి ఉద్యమం సమయంలో బీజేపీ (BJP) లో చేరారు.

Jishnudev Verma sworn in as new Governor of Telangana
తెలంగాణ నూతన గవర్నర్ (New Governor Telangana) గా జిష్ణుదేవ్ వర్మ (Jishnudev Verma) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, పుష్పగచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పలువురు కిషన్‌రెడ్డి సహా మంత్రులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
తెలంగాణ నాలుగోవ గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం చేశారు. జిష్ణుదేవ్ వర్మ 1957 అగస్ట్ 15న జన్మించారు. రామజన్మభూమి ఉద్యమం సమయంలో బీజేపీ (BJP) లో చేరారు. త్రిపుర (Tripura) ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. 2018-2023 మధ్య త్రిపుర ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. జిష్ణు దేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు గవర్నర్ పదవిని కట్టబెట్టింది.