మోదీని ఆటోగ్రాఫ్‌ అడిగిన బైడెన్‌.. ఇది సార్‌ ఇండియా రేంజ్‌..

మార్కెట్‌లో ఆయన క్రేజ్‌ చూస్తుంటే పిచ్చిక్కిపోతోంది. ఇది పవన్‌ కళ్యాణ్‌ గురించి రావు రమేష్‌ గబ్బర్‌సింగ్‌లో చెప్పిన డైలాగ్‌. కానీ ఇదే మాట మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ప్రపంచ దేశాదినేతలు అంటున్నారు. ఇదేదో స్టోరీ కోసం చెప్పిన మాట కాదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 21, 2023 | 05:46 PMLast Updated on: May 21, 2023 | 5:46 PM

Joe Biden Asked For Modis Autograph

జపాన్‌లో జరుగుతున్న జీ7 దేశాల మీటింగ్‌లో స్వయంగా అమెరికా ప్రెసిడెంట్‌ జోబైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌ అన్న మాట. దేశం ఏదైనా కావచ్చు, స్టేజ్‌ ఎక్కడైనా ఉండొచ్చు.. వన్స్‌ మోదీ ఎంటర్స్‌.. క్రేజ్‌ విల్‌ బి సింగిల్‌ సైడ్‌. ఇది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మన ప్రధానికి ఉన్న క్రేజ్‌. ఆయన స్పీచ్‌ ఇచ్చే విధానం, చరిష్మా ప్రతీ ఒక్కరినీ కట్టి పడేస్తాయి. అందుకే మోదీ మీటింగ్‌కు వస్తున్నారంటే అక్కడ ఇసకేసినా రాలనంత జనం ఉంటారు.

ప్రస్తుతం జపాన్‌లో జీ7 దేశాల మీటింగ్‌ జరుగుతోంది. అక్కడికి ప్రపంచ దేశాదినేతలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వెళ్లారు. అక్కడ మీటింగ్‌ ముగిసిన తరువాత దేశాదినేతలంతా కాసేపు పర్సనల్‌గా మాట్లాడుకున్నారట. అదే టైంలో అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ మోదీ దగ్గరికి వచ్చి మీరు నాకు పెద్ద ప్రాబ్లమ్‌ క్రియేట్‌ చేశారు అని చెప్పారట. ఆ ప్రాబ్లం ఏంటీ అంటే.. త్వరలో మోదీ అమెరికా వెళ్లనున్నారు.

అక్కడ ఓ పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ మీటింగ్‌లో మోదీని కలిసే చాన్స్‌ ఇప్పించాలని బైడెన్‌కు వందల ఫోన్లు వస్తున్నాయట. ఇప్పటి వరకూ తనను కలవని వాళ్లు కూడా ఫోన్లు చేసి మోదీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చించాలని కోరుతున్నారట. వైట్‌ హౌజ్‌ అదికారులకు ఇలాంటి ఫోన్లు రోజూ వస్తున్నాయట. అమెరికాలో ఓ ఇండియన్‌ లీడర్‌కు ఈ రేంజ్‌లో క్రేజ్‌ ఎప్పుడూ చూడలేదు అని చెప్పారట బైడెన్‌. అంతే కాదు.. ఈ క్రేజ్‌ చూస్తుంటే నాకు మిమ్మల్ని ఆటోగ్రాఫ్ అడగాలనిపిస్తోంది అని చెప్పారట.

ఇదే విషయం ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బెనీస్‌ కూడా చెప్పారట. అమెరికాలో ఏ సీన్‌ కనిపిస్తోందో ఆస్ట్రేలియాలో కూడా సేమ్‌ సిచ్యువేషన్‌ అని చెప్పారట. త్వరలో మోదీ ఆస్ట్రేలియాలో కూడా ఓ మీటింగ్‌ అటెండ్‌ చేయబోతున్నారు. ఆ మీటింగ్‌ జరిగే స్టేడియంలో 20 వేల మంది మాత్రమే కూర్చునే ఫెసిలిటీ ఉందట. ఇప్పటికే ఆ టికెట్లన్నీ అమ్ముడయ్యాయట. కానీ ఇంకా టికెట్స్‌ కావాలని ఏకంగా ప్రధానికే రిక్వెస్ట్‌లు పెడుతున్నారట అక్కడి లీడర్స్‌, పబ్లిక్‌. కొత్త టికెట్లు అయినా ఇవ్వండి లేదంటే అందరికీ సరిపోయేలా మీటింగ్‌ ప్లేస్‌ మార్చండి అంటూ డిమాండ్‌ చేస్తున్నారట.

వీళ్లిద్దరూ చెప్తున్న విషయాలు చూసి మిగిలిన దేశాధినేతలు షాకయ్యారట. మా సమస్యలకు మీరే సొల్యూషన్‌ చెప్పాలి అంటూ బైడెన్‌ మోదీతో సరదాగా అన్నారట. జీ7 మీటింగ్‌ తరువాత జరిగిన ఈ సీన్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనా మోదీ క్రేజ్‌ చూసి అగ్రదేశాధినేతలే షాకవుతున్నారంటే నిజంగా మోదీ చరిష్మాకు సెల్యూట్‌ కొట్టాల్సిందే.