ఎంత కష్టం వచ్చింది జోగి…?
అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు వదలడం లేదు.

అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు వదలడం లేదు. ఆయన విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో మంగళగిరి పి ఎస్ లో విచారణకు హాజరు అయ్యారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఆయన విచారణకు హాజరు కావాల్సిందే అని నోటీసుల్లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు.
ఇప్పటికే పదిమంది అనుచరులను విచారించిన పోలీసులు… కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. మరి కొంతమందిని అరెస్ట్ చేయగా బెయిల్ పై విడుదల అయ్యారు. దాడి సమయంలో అనుచరుల ఇచ్చిన సమాచారంతో జోగిని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. జోగి రమ్మంటేనే వచ్చినట్లు ఇప్పటికే పోలీసులకు అనుచరులు చెప్పినట్టు సమాచారం.