Congress Party : కాంగ్రెస్‌లో చేరిక.. మల్కాజ్‌గిరి నుంచి పోటీ ఈటల
తెలంగాణ ఎన్నికల తర్వాత.. ఎవరి గురించైనా చర్చ భారీగా జరుగుతుంది అంటే.. అది కచ్చితంగా ఈటల గురించే ! ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నాయకులు.. బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా నిలిచిన నేత.. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడంతో.. కొత్త చర్చ జరిగింది. దీనికితోడు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు.. ఈటలకు పొమ్మనలేక పొగపెడుతున్నాయా అనే అనుమానాలు వచ్చేలా చేశాయి
తెలంగాణ ఎన్నికల తర్వాత.. ఎవరి గురించైనా చర్చ భారీగా జరుగుతుంది అంటే.. అది కచ్చితంగా ఈటల గురించే ! ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నాయకులు.. బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా నిలిచిన నేత.. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడంతో.. కొత్త చర్చ జరిగింది. దీనికితోడు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు.. ఈటలకు పొమ్మనలేక పొగపెడుతున్నాయా అనే అనుమానాలు వచ్చేలా చేశాయి. బండి సంజయ్, ఈటల మధ్య గ్యాప్ ఉందన్నది రాజకీయవర్గాల్లో వినిపించే మాట. అలాంటిది అదే బండికి మళ్లీ అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న వేళ.. ఈటల భవిష్యత్ ఏంటనే ప్రశ్నలు వినిపించాయ్. ఆయన త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ.. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. దీనిపై ఈటల ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరడం లేదని తేల్చి చెప్పేశారు. హస్తం పార్టీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. లేదంటే బీజేపీలో ఉన్నవారే తాను కమలం పార్టీని వీడాలని ప్రయత్నం చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యుల చేశారు.
తాను బీజేపీలోనే ఉంటూ.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నా అని క్లారిటీ ఇచ్చారు ఈటల. గజ్వేల్‌లో ఓడిపోయినా.. తిరిగి లోక్‌సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఈటల వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతోంది. ఆయన మాటలతో పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చినట్లు అయింది. బీజేపీ పెద్దలతో ఈటలకు ఎలాంటి విబేధాలూ లేవని తెలుస్తోంది. అందుకే ఆయనకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. హైకమాండ్ పెద్దల్ని ఆయన్ని మల్కాజ్‌గిరి స్థానం నుంచి బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పుట్టిన ఈ గాసిప్ వైరల్ కావడంతో.. దానికి ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ఆయన కాంగ్రెస్‌లో చేరట్లేదని తేలిపోయింది. ఇప్పటికైనా ఈ ప్రచారానికి బ్రేక్ పడుతుందా.. ఇలానే కంటిన్యూ అవుతుందా అన్నది ఎదురుచూడాలి మరి.