బ్రేకింగ్: జానీ మాస్టర్ అరెస్ట్
గత నాలుగు రోజుల నుంచి జానీ మాస్టర్ వ్యవహారం సంచలనం అవుతోంది. జానీ మాస్టర్ పై రేప్ కేసు పెట్టడం ఆ తర్వాత ఆయన పరారిలో ఉండటం అన్నీ కూడా ఆసక్తిని రేపాయి జనాల్లో.

గత నాలుగు రోజుల నుంచి జానీ మాస్టర్ వ్యవహారం సంచలనం అవుతోంది. జానీ మాస్టర్ పై రేప్ కేసు పెట్టడం ఆ తర్వాత ఆయన పరారిలో ఉండటం అన్నీ కూడా ఆసక్తిని రేపాయి జనాల్లో. ఇక జానీ మాస్టర్ తనను వేధించాడు అంటూ ఆమె సాక్ష్యాలతో సహా కేసు పెట్టడంతో పోలీసులు కూడా జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేసారు.
ఆయన లడఖ్ వెళ్ళిపోయారు అనే వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ పోలీసులు అదుపులో ఉన్నాడు జాని మాస్టర్. అక్కడి నుంచి జానీ మాస్టర్ ను హైదరాబాద్ తీసుకొస్తున్నారు. రేపు ఆయనను రిమాండ్ చేసే అవకాశం ఉంది.