JP Nadda coming : నేడు తిరుపతికి రానున్న JP నడ్డా..
పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) ప్రచారంలో భాగంగా BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా (శనివారం) నేడు తిరుపతికి రానున్నారు.

JP Nadda coming to Tirupati today..
పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) ప్రచారంలో భాగంగా BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా (శనివారం) నేడు తిరుపతికి రానున్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన తిరుపతిలో రోడ్డు షో నిర్వహించనున్నారు JP నడ్డా(JP Nadda).. ఫూలే విగ్రహం వద్ద నుంచి నాలుగుకాళ్ళ మండపం వరకు రోడ్డు షో సాగనుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి తరపున ప్రచారం కోసం జేపీ నడ్డా ఆదోనికి వెళ్లనున్నారు. ఇవాళ నగరంలోని మున్సిపల్ మైదానంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి, టీడీపీ (TDP) పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు గెలుపు కోసం ఆయన ఆదోనికి లో ప్రచారం చేయనున్నారు. నడ్డాతో పాటు TDP యువ నేత నారా లోకేష్, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు రోడ్డు షోలో పాల్గొననున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికలు సోమవారం జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెరపడనుంది.
Suresh SSM