YCP vs BJP: వైసీపీని నడ్డి మీద తన్నిన నడ్డా! వైసీపీ – బీజేపీ దోస్తీ ఫసక్? మోదీ నెక్ట్స్ టార్గెట్ జగన్?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతుండంతో బీజేపీ తన రియాలిటీని స్లో స్లోగా బయటకు తీస్తోంది! నిన్నమొన్నటివరకు జగన్ పట్ల మెతక వైఖరి ప్రదర్శించిన కమలం పార్టీ రూట్ మార్చి వైసీపీపై నిప్పులు చెరిగింది.
ఏపీలో బీజేపీ శత్రువులు లేరు. అధికారంలో ఉన్న వైసీపీతో సీక్రెట్ ఫ్రెండ్‌షిప్ ఉంటుంది..అది పార్లమెంట్‌లో బిల్లులు పెట్టిన సమయంలో బయటపడుతుంది. అటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీతో పడనట్టే రాష్ట్రస్థాయి నేతలు నటించినా వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కలిసే పోటి చేస్తారన్న ప్రచారముంది. ఇప్పటికే దీనికి మోదీ-అమిత్‌షా అంగీకరించినట్టు టాక్. మొన్న అమిత్‌షా, చంద్రబాబు మధ్య భేటీ కూడా పొత్తుల గురించే జరగగా.. బయటకు మాత్రం.. ప్రస్తుతానికి తమ మధ్య ఏమీ లేనట్టు కలిసి డ్రామా ఆడుతున్నారు. ఇదంతా పొలిటికల్ గేమ్ ప్లాన్! అయితే ఏదో ఒక రోజు ఈ నటనను ఆపాల్సిన అవసరముంటుంది. బీజేపీ అందుకే స్లోగా రూట్ మర్చుతోంది. ఇటివలే తిరుపతికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ గేమ్ టీజర్ రిలీజ్ చేశారు.. వైసీపీపై చేలరేగిపోయి విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్ పేరును మాట వరుసకైనా లిఫ్ట్ చేయని జేపీ నడ్డా.. వైసీపీ సర్కారుపై మాత్రం నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్ జరుగుతోందని మండిపడ్డారు. ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని నడ్డా ఫైర్ అయ్యారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నడ్డా చేసిన వ్యాఖ్యలతో వైసీపీ డిఫెన్స్‌లో పడిపోయింది. బయట వ్యక్తుల విమర్శలను ఏ మాత్రం తట్టుకోలేని వైసీపీ నాయకులు నడ్డా విషయంలో మాత్రం మౌనంగా ఉండిపోయారు. కక్కలేక..మింగలేక.. ఏం చేయాలో అర్థంకాని డైలామాలో పడిపోయారు.
నిజానికి నడ్డా వ్యాఖ్యలు బీజేపీ-టీడీపీ రహస్య దోస్తిలో టీజర్ మాత్రమే.! అసలు సినిమా ముందుంది. ఇన్నాళ్లు సీఎం జగన్‌తో పాటు వైసీపీకి ఉన్న 22మంది ఎంపీలను తెలివిగా..పార్లమెంట్ అవసరాలకు తగ్గట్టుగా వాడుకున్న బీజేపీ ఇక ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతుండడంతో నిజస్వరూపాన్ని చూపించడానికి రెడీ అయ్యింది. ఇకపై ఏపీలో కేంద్రం టార్గెట్ వైసీపీనే! జగన్‌కు చివాట్లు పెట్టేందుకు..ప్రజల్లో అతడిని విలన్ చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.
ఇటు ప్రజలకు కూడా 2014దోస్తి రిపీట్ అవుతుందన్న సంకేతాలు పంపే విధంగా నడ్డా వ్యాఖ్యలు చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచిందని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని నడ్డా చేసిన కామెంట్స్‌కు స్క్రిప్ట్ టీడీపీ నేతలే ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే టీడీపీ వాదననే నడ్డా తన భాషలో బయటకు చెప్పారు. కేంద్రం ఇచ్చే ఇళ్లకు వైసీపీ జెండా రంగులు వేసుకుంటున్నారన్న నడ్డా.. రాష్ట్రానికి కేంద్రం 40 లక్షల ఇళ్లు ఇస్తే.. 20 లక్షలు కూడా నిర్మించలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల కోసం నిర్మించే రైల్వే లైన్ల కోసం పావలా వంతు నిధుల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని.. గ్రామీణ సడక్ యోజన కింద కేంద్రం రోడ్లు వేయిస్తుంటే ప్రభుత్వం ఆ విషయం కూడా చెప్పడం లేదంటూ నడ్డా తీవ్రస్థాయిలో విమర్శించారు. నడ్డా వ్యాఖ్యలను ఊహించని వైసీపీ నేతలు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలోనని తెగ ఆలోచిస్తున్నారు. నడ్డాపై రివర్స్ అటాక్ చేస్తే ఒక బాధ.. చేయకపోతే మరో బాధ అన్నట్టు తయారైంది వైసీపీ దుస్థితి!