Jr. NTR: జూ.ఎన్టీఆర్ బాటలోనే కళ్యాణ్‌రామ్ !? నందమూరి కుటుంబంలో గ్యాప్?
తెలుగు రాష్ట్రాల్లో నందమూరి కుటుంబం పరిచయం అవసరం లేని కుటుంబం. అప్పుడు ఎన్టీఆర్.. తరువాత బాలయ్య.. ఇప్పుడు జూనియర్.. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ఇది ఫ్యాన్స్ ఇచ్చిన జడ్జ్‌మెంట్.
అవును.. బాలకృష్ణ తరువాత నందమూరి లెగసీని కంటిన్యూ చేస్తూ ఎన్టీఆర్ పేరును విశ్వవ్యాప్తం చేసిన హీరో జూనియర్ ఎన్టీఆర్. కానీ జీవితంలో ఎంద ఎత్తుకు ఎదిగినా ఎన్టీఆర్‌ను మాత్రం నందమూరి కుటుంబం దూరం పెడుతోంది. రోజురోజుకూ వాళ్ల బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
జూనియర్‌కు మద్దతుగా ఉంటున్నాడని హీరో కళ్యాణ్‌రామ్‌ను కూడా బాలకృష్ణ దూరం పెండుతున్నాడనే టాక్ నడుస్తోంది. హైదరాబాద్ కైతలాపూర్‌లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలే దీనికి సాక్ష్యం. హైదరాబాద్ నడిబొడ్డు నిర్వహించిన ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ హీరోలంతా వచ్చారు. అక్కినేని, దగ్గుబాటి కాంపౌండ్ నుంచి కూడా హీరోలు హాజరయ్యారు. కానీ తాత వారసత్వాన్ని నేటి తరానికి పరిచయం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కనిపించలేదు.
ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను చాలా హర్ట్ చేసింది. పర్సనల్ ట్రిప్ ఉన్న కారణంగా ఎన్టీఆర్ ఈ ఈవెంట్‌కు రాలేదని చెప్పారు. ఇక్కడిదాకా బానే ఉంది. కానీ ఈ వేడుకకు హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా రాలేదు. ఎన్టీఆర్ తరువాత తాత వారసత్వాన్ని కొనసాగిస్తున్న మూడోతరం హీరో కళ్యాణ్ రామ్. తల్లి ఒక్కరు కాకపోయినా.. కళ్యాణ్‌రామ్, జూనియర్ తండ్రి ఒక్కడే. అటు బాలకృష్ణతో కూడా కళ్యాణ్ రామ్‌కు మంచి అనుబంధం ఉంటుంది. కానీ వేడుకకు కళ్యాణ్‌రామ్ రాకపోవడంతో బాలకృష్ణ కళ్యాణ్‌రామ్‌ను కూడా పక్కన పెట్టేశాడా అనే టాక్ నడుస్తోంది.
కళ్యాణ్ రామ్ ప్రతీ విషయం జూనియర్‌కు సపోర్ట్ చేస్తాడు. ఏ కష్టం వచ్చినా పక్కనే ఉంటాడు. ఆ మధ్య తారకరత్న దశదినకర్మలో బాలకృష్ణ రాగానే ఎన్టీఆర్ లేచి నిలబడ్డాడు. కానీ బాలకృష్ణ మాత్రం కనీసం పట్టించుకోలేదు. అప్పుడు ఎన్టీఆర్ పక్కనే కళ్యాణ్‌రామ్ కూడా ఉన్నాడు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఎన్టీఆర్‌కు సపోర్ట్ ఇస్తున్న కారణంగానే కళ్యాణ్ రామ్‌ను కూడా పక్కన పెట్టేశారా అనే టాక్ నడుస్తోంది.
ఈ ఈవెంట్ కోసం ప్రతీ ఒక్క హీరోకు బాలకృష్ణ స్వయంగా వెళ్లి ఇన్విటేషన్ ఇచ్చారు. కానీ జూనియర్‌కు మాత్రం ఉత్సవ కమిటీ సభ్యులు వెళ్లి ఇచ్చారు. దీంతో జూనియర్ ఈవెంట్‌కు రాకుండా తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ ట్రిప్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. తారక్ రాకపోవడంతో కళ్యాణ్‌రామ్ కూడా రాలేదంటున్నారు. తమ్మడు వెళ్లని చోటుకు తాను వెళ్లకూడదని కళ్యాణ్‌రామ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇక నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ పూర్తిగా దూరం ఐనట్టే.