Jr.NTR: హృతిక్‌కు హ్యాండ్ ఇచ్చి సల్లూ భాయ్‌తో వెళ్లిపోతున్న తారక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వస్తున్న వార్-2 సినిమాలో తారక్ కనిపించబోతున్నాడు. హృతిక్ రోషన్‌తో హోరాహోరీ తలబడబోతున్నాడు.

All that is the collection of dirt in the pipeline.whenerver ur free leave the tap open for 10 to 15 min continuously for one tome
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వస్తున్న వార్-2 సినిమాలో తారక్ కనిపించబోతున్నాడు. హృతిక్ రోషన్‌తో హోరాహోరీ తలబడబోతున్నాడు. ఇది అందరికీ తెలిసిన న్యూస్. కానీ వార్-2 కంటే ముందే వేరే సినిమాతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ బాలీవుడ్ మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న టైగర్-3 సినిమాలో తారక్ కనిపించబోతున్నాడట. అయితే ఏ రోల్‌లో కనిపించబోతున్నాడు.. విలన్‌గానా లేకా సపోర్టింగ్ రోల్‌లోనా అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ సినిమా వార్-2 కంటే ముందే దీపావళికే రిలీజ్ కాబోతోంది. అంటే దీపావళికే తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది.
ఈ న్యూస్ తారక్ ఫ్యాన్స్‌లో మంచి జోష్ నింపింది. దీని గురించి గాసిప్స్ గాట్టిగానే వినిపిస్తున్నా.. మూవీ యూనిట్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో ఈ అప్‌డేట్ కోసం తారక్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు తారక్. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను చాలా వైల్డ్‌గా తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్లను పిలింపించ మరీ ఫైట్ సీన్లు కంపోజ్ చేయించాడు. సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తైంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫేవరెట్ స్టార్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.