Chandrababu: చంద్రబాబుకు బెయిలా.. రిమాండా..? నేడు ఐదు కేసుల్లో తీర్పు వెలువడే అవకాశం

చంద్రబాబుకు ఈరోజు కీలకంగా మారనుంది. మొత్తం ఐదు కేసుల్లో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఈ సారి అయినా సానుకూలంగా వస్తుందా.. లేక ఎదురుదెబ్బ తప్పదా అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 9, 2023 | 10:15 AMLast Updated on: Oct 09, 2023 | 10:15 AM

Judgment In Five Cases Related To Chandrababu Will Be Pronounced Today

చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి నేటికి 30 రోజులు అయింది. ఏసీబీ కోర్ట్ ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా పంపిన విషయం తెలిసిందే. అయితే గడిచిన నెల రోజులుగా అనేక కోర్టుల్లో చంద్రబాబు తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు దాదాపు ఐదు కేసుల్లో కోర్టులు తమ తీర్పులు వెలువరించనుంది. అందులో మూడు హైకోర్టులో కాగా రెండు ఏసీబీ కోర్టులో ఉన్నాయి. దీంతో ఏమౌతుందా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

ఏసీబీ కోర్టులో బెయిల్ పై తీర్పు..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. అదే సమయంలో సీఐడీ కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత శుక్రవారం సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి జస్టీస్ హిమబిందు తీర్పును రిజర్వ్ చేసి సోమవారం వెలువరిస్తామన్నారు. దీంతో అందరి చూపు ఈ తీర్పుపైనే పడింది. నేడు ఏమౌతుంది, చంద్రబాబు బయటకు వస్తారా.. లేక సీఐడీ రిమాండ్ కి ఆదేశిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 12గంటలలోపూ తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో పాటూ సీఐడీ దాఖలు చేసిన రెండు పీటీ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవి రానున్న రోజుల్లో చర్చకు రానున్నట్లు సమాచారం.

హై కోర్టులోనూ మూడు బెయిల్ పిటిషన్లు..

గతంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ వేసిన చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. దానిని రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో సీఐడీ న్యాయవాదులు మరిన్ని కేసులను వెలుగులోకి తీసుకొచ్చారు. అంగళ్లు విధ్వంసానికి సంబంధించి ప్రదాన నిందితుడు చంద్రబాబుగా పేర్కొన్నారు. దీనిపై టీడీపీ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గత 10 రోజులుగా విచారణ కొనసాగింది. ఈరోజు తీర్పు వెలువరిచంనున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో మరో రెండు కేసుల తీర్పులు కూడా రావల్సి ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అలైన్ మెంట్ మార్చి లబ్ధిపొందినట్లు సీఐడీ కేసు ఫైల్ చేసింది. ఫైబర్ గ్రిడ్ లో అవినీతి జరిగిందని తన వాదనలు వినిపించారు ఏజీ. అయితే ఈ రెండు కేసులు కూడా నేడు తీర్పు వెలువడనున్నట్లు సమాచారం.

సుప్రీం కోర్టులో క్వాష్ పిటీషన్ విచారణ..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హై కోర్టు తోసిపుచ్చింది. దీనిని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు చంద్రబాబు న్యాయవాది లూథ్రా. సుప్రీం కోర్టులోని ఆరవ కోర్టులో ఐటెం నంబర్ 59గా పిటిషన్ జాబితాలో చేర్చారు. దీనిని జస్టిస్ అనిరుద్దాబోస్, జస్టిస్ బేలా, ఎం త్రివేదీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారన చేపట్టనుంది. గతంలో ఈ అంశంపై స్పందించిన సుప్రీం కోర్టు.. హై కోర్ట్ కొట్టివేసిన క్వాష్ పిటీషన్ పత్రాలతో పాటూ, ఏపీ ప్రభుత్వం హై కోర్టుకు సమర్పించిన దస్త్రాలను సుప్రీం కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అంత త్వరగా కొట్టేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ రోజు వాదనలు విని మరోసారికి వాయిదా వేసే అవకాశం ఉంది అంటున్నారు న్యాయ నిపుణులు.

T.V.SRIKAR