Kavitha’s bail : కవిత బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam) లో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు వెలువడనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 6, 2024 | 10:37 AMLast Updated on: May 06, 2024 | 10:37 AM

Judgment On Kavithas Bail Petitions Today

 

 

 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam) లో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు వెలువడనుంది. రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ తీర్పు ఇవ్వనున్నారు. ఈడీ(ED), సీబీఐ (CBI) కేసుల్లో బెయిల్ కోసం కోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఈ రెండు కేసుల్లోనూ వాదనలు ముగియగా.. ఈరోజు కోర్టు తీర్పు ఇవ్వనుంది.

కవిత బెయిల్ పై గత నెల 22న కోర్టులో వాదనలు జరగ్గా.. ఈ నెల 2కు తీర్పు రిజర్వ్ చేశారు. కానీ పలు కారణాలతో ఆరోజు కూడా తీర్పు వాయిదా పడింది. కాగా, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ కింద తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు మే 6కు రిజర్వ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లో బెయిల్‌ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

SSM