Delhi Liquor Case : నేడు కేజీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పు…
ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Liquor Case), మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టులో నేడు తీర్పు వెలువడనుంది.

Judgment on Kejriwal's interim bail petition today
ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Liquor Case), మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టులో నేడు తీర్పు వెలువడనుంది. కాగా మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు విన్న ధర్మసనం న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తీర్పును ఈరోజు(మే 10)న వెలువరిస్తామని తెలిపారు.
ఇవాళ సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా (Sanjeev Khanna) తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ అంశంపై ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
కేజ్రీవాల్ తరపు న్యాయవాది షరతులతోనైనా మధ్యంతర బెయిల్ (interim bail ) ఇవ్వాలని కోరారు. మధ్యంతర బెయిల్‌ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కానప్పటికీ తమకు తెలిసి దేశంలో ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని ఇడి తెలిపింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ కోరడంపై ఇడి మండిపడుతూ గతంలో కూడా సమన్లను తప్పించుకోవడానికి కేజ్రీవాల్ ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయంటూ ఇదే సాకు చూపారని తెలిపింది. ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వడం సరికాదంటూ నిన్న ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది.
అవినీతి కేసులో నిందితులుగా ఆప్.. ఇదే తొలిసారి!
ఢిల్లీ మద్యం కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీని తాజా ఛార్జిషీట్లో నిందితులుగా పేర్కొననుంది. అవినీతి కేసులో దాఖలు చేసిన చార్జిషీట్లో ఏ ఏజెన్సీ అయినా జాతీయ పార్టీని నిందితుడిగా పేర్కొనడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఈ కేసులో కొన్ని తాజా ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేయనుంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజీవాల్ను కూడా కేంద్ర ఏజెన్సీ నిందితుడిగా పేర్కొననుంది.
SSM