Jr. NTR: ప్రతీ కష్టంలో నాకు తోడుంది అభిమానులే.. కన్నీళ్లు పెట్టుకున్న జూ.ఎన్టీఆర్..
దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్‌లో ఫ్యాన్స్ అభిమానాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎన్టీఆర్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్‌లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రిపులార్ సినిమా తరువాత ఆ క్రేజ్ దేశమంతా వ్యాపించింది. ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను ఎంత ప్రేమిస్తారో ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్‌ను అంతే ప్రేమిస్తారు. ప్రతీ ఈవెంట్‌లో ఫ్యాన్స్ అంతా ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలంటూ చెప్తుంటారు. ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్‌కు అంత ఇష్టం. రీసెంట్‌గా దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్‌లో ఫ్యాన్స్ అభిమానాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎన్టీఆర్. నా ఒడుదొడుకుల్లో అభిమానులు తోడున్నారు. నేను కిందపడ్డ ప్రతీసారి వాళ్లు నన్ను పట్టుకుని పైకి లేపారు. నా కంటికి వచ్చిన ప్రతీ కన్నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారు. నేను నవ్వినప్పుడల్లా నా అభిమానులు సంతోషించారు. అలాంటి ఫ్యాన్స్ ఉండటం నా అదృష్టం. జీవితాంతం వాళ్లకు రుణపడి ఉంటానంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తారక్ ఫ్యాన్స్ అంతా పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు.. జీవితాంతం మీకు అండగా ఉంటామంటూ కామెంట్స్ చేస్తున్నారు.