Kanara ntr : కాంతారా ప్రీక్వెల్ లో జూనియర్ ఎన్టీఆర్..

కాంతార.. చిన్న సినిమాగా వచ్చి బాక్సాపీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భూతకోలా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ.. అంచనాలకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. సినిమా విడుదలైనప్పుడు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేవలం కన్నడలోనే సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. కానీ న వారం తర్వాత మిగతా భాషల్లో ఈ సినిమా విడుదలై ఒక సంచలనం క్రియేట్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2024 | 01:03 PMLast Updated on: Mar 10, 2024 | 1:03 PM

Junior Ntr In Kantara Prequel

కాంతార.. చిన్న సినిమాగా వచ్చి బాక్సాపీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భూతకోలా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ.. అంచనాలకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. సినిమా విడుదలైనప్పుడు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేవలం కన్నడలోనే సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. కానీ న వారం తర్వాత మిగతా భాషల్లో ఈ సినిమా విడుదలై ఒక సంచలనం క్రియేట్ చేసింది. ఆ విజయం స్ఫూర్తితో ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతారా: చాప్టర్ 1 తీసుకొస్తున్నారు మేకర్స్.. కాంతారాను మించి ఈ సినిమా ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ మాటను నిలబెట్టుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో సినిమాలో కొన్ని స్పెషల్ రోల్స్ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మిగిలిన భాషల్లో స్టార్ డమ్ నటులను తీసుకోవాలని అనుకుంటున్నారట. అలా టాలీవుడ్ (Tollywood) నుంచి నుంచి మాత్రం ఒక పవర్ఫుల్ హీరోను తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. అది మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ అని గాసిప్స్ గట్టిగానే వస్తున్నాయి.కాంతారా ప్రీక్వెల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో నటింపజేసేందుకు ఆ మూవీ మేకర్స్ తీవ్ర ప్రయత్నాలైతే చేస్తున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే కర్ణాటకకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel) తో పాటు అలాగే కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని కలవడం ఇందుకు సాక్ష్యం అని అంటున్నారు. ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, కాంతార ప్రాజెక్టులో తారక్ కూడా ఒక భాగం కాబోతున్నాడు చెప్పుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కాకపోయినా కాంతారా ప్రీక్వెల్ లో తప్పకుండా ఒక టాలీవుడ్ హీరో అయితే కనిపించబోతున్నట్లు బలమైన టాక్ వస్తోంది. అయితే ఎన్టీఆర్ ఒకే చేశాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

కాంతార లాంటి ప్రాజెక్టులో ఎన్టీఆర్ కనిపిస్తే మాత్రం ఆ సినిమాకు మరింత మేజర్ ప్లేస్ పాయింట్ గా నిలుస్తుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం దేవర, వార్ మూవీల్లో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్టు వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. చూడాలి మరి ఏం జరుగుతుంద