Jyotirai’s videos viral : జ్యోతిరాయ్ అశ్లీల వీడియోలు వైరల్.. కన్నీళ్లు పెట్టుకున్న నటి..
టెక్నాలజీతో ఉపయోగం ఎంత ఉందో.. దారుణాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయ్. ఏఐ వచ్చాక మరింత పెరిగాయ్ కూడా ! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని.. సైబర్ నేరగాళ్లు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. నానా ఇబ్బందులు పెడుతూ పిచ్చి వేషాలు వేస్తున్నారు.

Jyotirai's obscene videos viral.. The actress shed tears..
టెక్నాలజీతో ఉపయోగం ఎంత ఉందో.. దారుణాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయ్. ఏఐ వచ్చాక మరింత పెరిగాయ్ కూడా ! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని.. సైబర్ నేరగాళ్లు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. నానా ఇబ్బందులు పెడుతూ పిచ్చి వేషాలు వేస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోల వ్యవహారంపై ఇప్పటికే చర్చ జరుగున్న వేళ.. మరో దారుణం జరిగింది. స్టార్ హీరోయిన్ల ఫోటోలను, వీడియోలను అసభ్యకరంగా ఎడిట్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇప్పుడు తెలుగు సీరియల్ నటి అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయ్. గుప్పెడంత మనసు అనే సీరియల్‌లో జగతి పాత్రలో ఫేమస్ అయిన.. ప్రముఖ సీరియల్ నటి జ్యోతిరాయ్ మార్ఫింగ్ వీడియో, మార్ఫింగ్ ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయ్.
జ్యోతి రాయ్‌కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయ్. ఇప్పుడు నటి జ్యోతి రాయ్ దీనిపై ఘాటుగా స్పందించారు. ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో ఆమె ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. అసంతృప్తిని వ్యక్తం చేసింది. తనతో పాటు తన కుటుంబ గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు దిగజార్చడానికే కొందరు ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారని.. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలతో పాటు తనకు వస్తోన్న మెసేజ్‌లు చూసి బాధతో పాటు భయం కూడా కలుగుతోందని జ్యోతిరాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పాటు తన కుటుంబానికి కూడా హాని ఉందని ఎమోషనల్ పోస్ట్ చేసింది.