KAVITHA CASE: కవితకు బెయిల్ పెండింగ్.. ఇంటి భోజనం, జపమాలకు ఓకే
తన చిన్న కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నందున.. ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిల్ కావాలని కవిత కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పాటు.. రెగ్యులర్ బెయిల్ పైనా వాదనలు వినిపించారు. దాంతో అసలు మీరు ఏ బెయిల్ కోసం వాదనలు వినిపిస్తున్నారో తేల్చుకోవాల్సంటూ కేసును వాయిదా వేసింది కోర్టు.
KAVITHA CASE: మధ్యంతర బెయిల్ ఇప్పించాలంటూ ఎమ్మెల్సీ కవిత కేసు వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈనెల 4కు పోస్ట్ పోన్ చేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు. కవిత తరపున లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. తన చిన్న కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నందున.. ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిల్ కావాలని కవిత కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పాటు.. రెగ్యులర్ బెయిల్ పైనా వాదనలు వినిపించారు.
Pooja Hegde: అజ్ఞాతవాసి.. బాయ్ ఫ్రెండ్ తో పూజా హెగ్డే కారులో షికారు
దాంతో అసలు మీరు ఏ బెయిల్ కోసం వాదనలు వినిపిస్తున్నారో తేల్చుకోవాల్సంటూ కేసును వాయిదా వేసింది కోర్టు. కవిత తరపున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ.. ఈడీ విచారణకు కవిత అన్ని విధాలా సహకరించారని తెలిపారు. ఒక్కోసారి రాత్రి దాకా ఈడీ అధికారులు విచారణ జరిపారని తెలిపారు. ఇదంటా రాజకీయ కుట్రతో పెట్టిన కేసు అని వాదించారు. పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నందున.. కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అలాగే రెగ్యులర్ బెయిల్ పైనా తన వాదనలు వినిపించారు సింఘ్వీ. వాదనలు విన్న కోర్టు.. అసలు ఏ బెయిల్ కావాలో తేల్చుకోవాలంటూ కేసును ఈనెల 4కు వాయిదా వేసింది. ఇప్పటివరకూ లిక్కర్ కేసులో నిందితులు ఎవరికీ మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు కోర్టు.
అందువల్ల కవితకు రిలీఫ్ దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వకపోతే.. ఢిల్లీ హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కవిత లాయర్లు భావిస్తున్నారు. తీహార్ జైల్లో తనకు సౌకర్యాలు అందించడం లేదంటూ కవిత వేసిన పిటిషన్ పైనా కోర్టులో విచారణ జరిగింది. సౌకర్యాలపై కోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. కవితకు ఇంటి భోజనం, బుక్స్, షూతో పాటు మెడిటేషన్ చేసుకోడానికి జపమాల ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించింది కోర్టు.