K KAVITHA: కవిత బెయిల్‌పై నో రిలీఫ్.. తీర్పు ఈనెల 8కి వాయిదా
కోర్టులో కవిత తరపు న్యాయవాది, ఈడీ తరపు లాయర్ తమ వాదనలు వినిపించారు. తన చిన్న కొడుక్కి ప్రస్తుతం యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నందున.. బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు కవిత.
K KAVITHA: లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు గురువారం రౌస్ ఎవెన్యూ కోర్టులో రిలీఫ్ దక్కలేదు. మధ్యంతర బెయిల్ కోసం ఆమె పెట్టుకున్నపిటిషన్ పై తీర్పు ఈనెల 8కి వాయిదా పడింది. కోర్టులో కవిత తరపు న్యాయవాది, ఈడీ తరపు లాయర్ తమ వాదనలు వినిపించారు. తన చిన్న కొడుక్కి ప్రస్తుతం యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నందున.. బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు కవిత.
JANASENA: అవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్.. రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థిగా అరవ శ్రీధర్
పరీక్షల వేళ పిల్లలకు తల్లి సపోర్ట్ కావాలన్నారు. తల్లి జైల్లో.. తండ్రి కోర్టు కేసుల కోసం ఢిల్లీలో ఉండటంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నట్టు కవిత తరపు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. కుటుంబంలో తల్లి పాత్ర కీలకమన్నారు. కవిత కొడుకు భయంతో ఉన్నాడని ఆయనకు కోర్టుకు వివరించారు. ఏప్రిల్ 16 వరకూ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తి కావేరీ బవేజాకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్లను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సింఘ్వీ. ఈడీ లాయర్ మాత్రం కవిత బెయిల్ పిటిషన్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కీలకంగా ఉన్నారని వాదించారు. ఇండో స్పిరిట్ లో అరుణ్ పిళ్ళై, కవితకు 33 శాతం వాటాలు ఉన్నాయి.
అసలు కవిత ఆలోచనతోనే ఆప్‌కు 100 కోట్ల రూపాయలు ముట్టినట్టు ఈడీ లాయర్ వాదించారు. దినేష్ అరోరా అప్రూవర్‌గా మారాకే అన్ని విషయాలు బయటపెట్టాడని కోర్టుకు వివరించారు ఈడీ తరపు లాయర్. అలాగే బుచ్చిబాబు ఫోన్ లోని చాట్స్ తో ఎక్సైజ్ పాలసీ నోట్స్ రికవరీ అయ్యాయి. కవితకు అరుణ్ పిళ్ళై ఫ్రాక్సీగా ఉన్నారని చెప్పారు. లిక్కర్ కేసు విచారణ కీలక దశలో ఉన్నందున ఆమెకు బెయిల్ ఇస్తే ఇబ్బంది అని వాదించారు.. కవిత సాక్ష్యాలను తారుమారు చేస్తారని కూడా ఈడీ తరపు లాయర్ వాదించారు. వాదనలు పూర్తయ్యాక న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు.