KA PAUL: అపాయింట్‌మెంట్ ఇస్తావా.. శపించాలా..? జగన్‌‌కు పాల్ అల్టిమేటం

సీఎం జగన్‌ను కలిసేందుకు తాడేపల్లి వెళ్లారు. జగన్‌ అపాయింట్‌మెంట్ కోసం క్యాంప్ ఎదురుగా కూర్చుని ప్రయత్నిస్తున్నప్పటికీ అనుమతి రాలేదు. ఈ విషయం పాల్‌కు చెప్పిన పోలీసులు క్యాంపు కార్యాలయం నుంచి వెంటనే వెళ్లి పోవాలని సూచించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 9, 2024 | 03:49 PMLast Updated on: Jan 09, 2024 | 3:49 PM

Ka Paul Trying To Get Appointment Of Ys Jagan

KA PAUL: ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు ఏపీ జగన్. అయితే, పాల్ తనను కలిసేందుకు జగన్ అనుమతించలేదు. దీంతో జగన్ అపాయింట్‌మెంట్ కోసం పాల్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను కలిసేందుకు జగన్ అనుమతించకపోతే శపిస్తానని హెచ్చరించారు పాల్. తాజాగా ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ఏపీలో పర్యటస్తున్న పాల్.. మంగళవారం ఎన్నికల సంఘం అధికారులను కలిశారు.

REVANTH REDDY: శాసన మండలిపై రేవంత్ వ్యాఖ్యలు.. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు..

ఏపీ ఎన్నిలకపై తన సూచనలు ఇచ్చారు. అనంతరం.. సీఎం జగన్‌ను కలిసేందుకు తాడేపల్లి వెళ్లారు. జగన్‌ అపాయింట్‌మెంట్ కోసం క్యాంప్ ఎదురుగా కూర్చుని ప్రయత్నిస్తున్నప్పటికీ అనుమతి రాలేదు. ఈ విషయం పాల్‌కు చెప్పిన పోలీసులు క్యాంపు కార్యాలయం నుంచి వెంటనే వెళ్లి పోవాలని సూచించారు. గంటసేపటికిపైగా క్యాంప్ ఆఫీస్ మెయిన్ గేట్ వద్ద వేచి చూసిన కేఎ పాల్.. చివరకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జగన్‌పై పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎంతో మంది దేశాధినేతలు నేను అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం నాకు అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80సార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు. నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వని కేసీఆర్ మాజీ సీఎం అయ్యారు.

మాజీ సీఎం అయ్యాకే కేసీఆర్ నాకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన పరిస్థితి చూశారు. రేవంత్ రెడ్డి సైతం సీఎం అయ్యాక నాకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. సీఎం అపాయింట్‌మెంట్ కోసం ఇవాళ, రేపు విజయవాడలోనే ఉండి వేచి చూస్తా. అపాయింట్మెంట్ ఇస్తే సీఎంతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తా. రహస్యాలు చెబుతా. నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే సీఎం వైఎస్ జగన్ కూడా మాజీ సీఎం అవుతారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారో 75 సీట్లు గెలుస్తారో.. 25 సీట్లు గెలుస్తారో నాకు తెలియదు” అని పాల్ వ్యాఖ్యానించారు.