Jailer Movie: తమన్నా పాటకి స్టెప్పులేసిన కాజల్, సిమ్రన్.. వైరల్ గా మారిన ఏఐ వీడియో

తమన్నా అనే పేరే తన్మయత్వానికి గురిచేసేలా ఉంటుంది. అందులో ఆమె ఆందచందాల విషయానికొస్తే తాజాగా వెన్న చిలికినప్పుడు వచ్చే పై మీగడలాగా ఉంటాయి. అలాంటి భామ తాజాగా ఓపాటకు వేసిన స్టెప్పులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 12, 2023 | 03:34 PMLast Updated on: Jul 12, 2023 | 3:34 PM

Kajal And Simran Danced To Tamannaahs Song In Jailer

రజనీకాంత్ హీరోగా చేస్తున్న చిత్రం జైలర్. ఈ సినిమాలో తమన్నా ఒక ప్రత్యేక పాటలో కనిపించి కనువిందు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇందులో భాగంగా ఆమె చేసిన స్టెప్పులను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ పాట యూ ట్యూబ్ మొదలు ఇన్ స్టా వరకూ అన్నీ వేదికలను ఒక ఊపు ఊపేస్తుంది. ఆమె ఎంతటి గ్రేస్ ఫుల్ డ్యాన్సరో మరోసారి చెప్పకనే చెప్పినట్లు.. స్టెప్పులు వెయ్యకనే వేసేసింది. అన్నం ఉడికిందా లేదా అని పరీక్షించే ఒక మెతుకులాగా మారింది ఈ 20 సెకండ్ల వీడియో. ఇందులో మిల్క్ బ్యూటీ హుక్ స్టెప్ వేస్తూ ముఖ్యంగా కుర్రకారుల మదిని ఆకర్షించింది. ఇందులో ఇద్దరు అమ్మాయిలను కో డాన్సర్లుగా వినియోగించుకున్నారు.

ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఈ వీడియో పోస్ట్ చేసే క్రమంలో ఒక ట్యాగ్ లైన్ జోడించింది తమన్నా. నేను వేసిన హుక్ స్టెప్పులకు వీడియోలు క్రియేట్ చేయండంటూ సందేశాన్ని జోడించింది. ఇక మన యువత ఊరికే ఉంటారా చెప్పండి. అసలే ఆధునిక యుగం. అందునా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అడుగు పెట్టేసింది ప్రస్తుత సాంకేతికత మీద. ఇక చెప్పేదేముంది. తమన్నా చేసిన వీడియోకి ఇరువురు ప్రముఖ హీరోయిన్లు డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో వీడియోను క్రియేట్ చేసింది. ఇందులో కాజల్ అగర్వాల్, సిమ్రన్ ను పెట్టి అదే స్టెప్పులు వేసేలా వీడియో క్రియేట్ చేశారు. దీంతో చూసిన ప్రతి ఒక్కరూ ఆనందం.. ఆశ్చర్యానికి మధ్య ఊగిసలాడక తప్పదు. అంతలా ఈ డ్యాన్స్ యువతను ఆకట్టుకుంటుంది.

ఇక రజనీకాంత్ సినిమా విషయానికొస్తే ఇందులో చాలా మంది పేరొందిన ఆర్టిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారు. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, సునీల్, రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్ తదితరులు ప్రదాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 10న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మొదటి పాటగా ‘‘వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి’’ అనే పాటను విడుదల చేశారు. దీనిని ఇప్పటి వరకూ 2 కోట్ల మంది వీక్షించారు.

T.V.SRIKAR