Kalki 2 : కల్కి 2 కథ లీక్.. సర్‌ప్రైజ్‌లే సర్‌ప్రైజ్‌లు!
ఇప్పుడు ప్రతీ ఒక్కరి చర్చ కల్కి గురించే ! అసలు కలియుగం ఎప్పుడు అంతం కాబోతోంది.. అంతం అయ్యే ముందు భూమ్మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయ్.
ఇప్పుడు ప్రతీ ఒక్కరి చర్చ కల్కి గురించే ! అసలు కలియుగం ఎప్పుడు అంతం కాబోతోంది. అంతం అయ్యే ముందు భూమ్మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయ్. అసలు అశ్వత్థామకు, కల్కి జననానికి నిజంగా సంబంధం ఉందా.. స్టోరీ మధ్యలోకి కర్ణుడు ఎందుకు వచ్చాడు. అసలు అర్జునుడు, కర్ణుడిలో ఎవరు గొప్ప.. ఎవరు బలవంతలు.. ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్నాయ్. మరికొందరు అయితే మహాభారతం పుస్తకాలను బయటకు తీసి చదవడం మొదలుపెట్టారు. ఇదంతా ఎలా కల్కి మాత్రం సూపర్ సక్సెస్ అయింది. వాల్డ్‌వైడ్‌గా అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తోంది. కల్కి మూవీకి కొనసాగింపుగా పార్ట్ 2 సహా కల్కి యూనివర్స్ ఉంటుందని నాగ్అశ్విన్ కన్ఫార్మ్ చేశాడు. పార్ట్ 1లో ఉన్న ఎన్నో ప్రశ్నలకి పార్ట్ 2 లో ఆన్సర్లు దొరుకుతాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది చివరలో పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని.. వచ్చే ఏడాది మే, జూన్‌లో సినిమా రిలీజ్ అవుతుందని మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.
దీంతో ఇప్పుడు కల్కి2లో ఏం చూపించబోతున్నారు.. ఎలాంటి పాత్రలు ఉండబోతున్నాయ్. పార్ట్ 1లో ఉన్న కేరక్టర్సే.. పార్ట్2లో ఉంటాయా.. లేదంటే కొత్త పాత్రలు ఎంటర్ అవుతాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్న వేళ.. కల్కి 2 స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. కల్కిని మోస్తున్న తల్లి పాత్రను శంభాల నుంచి కర్ణుడు ఎత్తుకెళ్లడం.. అశ్వత్థామ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. ఫస్ట్ పార్ట్ ఎండ్ అయింది. ఇక మొదటి భాగంలో చాలా పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లాయ్. దుల్కర్ సల్మాన్, రాజేంద్రప్రసాద్, శోభన.. ఇలా కాసేపే స్క్రీన్ మీద కనిపించారు. ఈ పాత్రల బ్యాక్‌గ్రౌండ్‌ను పార్ట్ 2లో మరింత ఎలివేట్ చేయబోతున్నారట. పరుశురాముడి స్ఫూర్తితో దుల్కర్ సల్మాన్ పాత్రను నాగి క్రియేట్ చేసినట్లు కనిపిస్తోంది.
దీంతో దుల్కర్ సల్మాన్ పాత్ర మరింత హైలైట్‌గా ఉండబోతుందట. పార్ట్ 1కు ఓవరాల్ హైలైట్.. కురుక్షేత్రం సీక్వెన్స్. అర్జునుడిలా విజయ్, అశ్వత్థామలా అమితాబ్, కర్ణుడిలా ప్రభాస్.. లుక్ అదిరిపోయింది. ఫస్ట్ పార్ట్‌లో కనిపించింది కాసేపైనా.. పూనకాలు తెప్పించేశారు. సెకండ్ పార్ట్‌లో కురుక్షేత్రం సీన్స్ మరింత హైలైట్ చేసే చాన్స్ ఉంది.
ఇక కృష్ణుడి ఫేస్ రివీల్ చేయలేదు కాబట్టి.. పార్ట్ 2లో సర్‌ప్రైజ్ ఉండే చాన్స్ ఉంటుంది అంటున్నారు. ఇక పురాణాల ప్రకారం.. కల్కి సైన్యానికి అశ్వత్థామ సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు. కల్కి తరఫున యుద్ధం చేసే సైనికులకు శిక్షణ ఇస్తాడు. ఐతే కల్కికి కర్ణుడికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. నాగ్అశ్విన్ కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు కనిపిస్తున్నాడు. ద్వాపరయుగంలో చేసిన పొరపాట్లకు, తప్పుల పాపాలకు కల్కిని కాపాడుతూ ప్రాయశ్చిత్తం తీసుకునే పాత్రలో కర్ణుడు అంటే ప్రభాస్ కనిపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. మరి ఏది నిజం.. కథ ఇదేనా అంటే.. నెక్ట్స్ ఇయర్ మే, జూన్ వరకు వెయిట్ చేయాల్సిందే..