Kalki Prabhas : కల్కికి మొదటి అవార్డు.. ఇప్పుడే మొదలైంది
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 AD' మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'Kalki 2898 AD' directed by Nag Ashwin starring Prabhas as the hero has hit the screens on June 27.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 AD’ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాలీవుడ్ చిత్రాలను తలపించేలా విజువల్ వండర్ లా ఉందని ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రం.. వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ సినిమా.. వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మొదటి అవార్డును సొంతం చేసుకుంది.’కల్కి’ సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను సొంతం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదు. కానీ అప్పుడే ఈ సినిమా ఒక అవార్డుని గెలుచుకుందనే వార్త ఆశ్చర్యం కలిగించక మానదు. అయితే ఈ అవార్డు ఇచ్చిoది రానా దగ్గుబాటి కావడం విశేషం. ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ “కల్కికి మొదటి అవార్డు” అంటూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫొటోని పంచుకున్నాడు. దానిపై స్పందించిన రానా.. మరిన్ని అవార్డులు వస్తాయని అన్నాడు.
నిర్మాత అశ్వనీదత్ అయితే ‘కల్కి’ చిత్రం వసూళ్లను బట్టి ఈ మూవీ రూ.1500 కోట్ల వరకూ కలెక్ట్ చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా.. హిందీ బెల్ట్ లో కూడా ‘కల్కి’ బాగా ఊపందుకుంటోంది. హిందీలో మొదట కాస్త మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. శనివారం, ఆదివారం వీకెండ్ కావడంతో ఈ జోరు మరింత పెరగొచ్చు.