kalki 2898 AD: కల్కి రిలీజ్ డేట్ లాక్.. శ్రీరామ నవమి రోజే అనౌన్స్‌మెంట్..?
మే 13 న ఎలక్షన్స్ కాబట్టి, ఓటింగ్ తర్వాత మే 30 కి విడుదల చేయాలనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఆడేట్ కూడా డౌట్‌లో పడింది. జులై 10కే సినిమా రిలీజ్ అంటున్నారు. మే 30కి, జులై 10 కి మధ్య కనీసం 40 రోజుల వ్యత్యాసం ఉంది. దీనికి కూడా ఎలక్షన్లే కారణం.
kalki 2898 AD: కల్కి మూవీ రిలీజ్ డేట్ నిజానికి మే 09. కాని మే 13 న ఎలక్షన్స్ కాబట్టి, ఓటింగ్ తర్వాత మే 30 కి విడుదల చేయాలనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఆడేట్ కూడా డౌట్‌లో పడింది. జులై 10కే సినిమా రిలీజ్ అంటున్నారు. మే 30కి, జులై 10 కి మధ్య కనీసం 40 రోజుల వ్యత్యాసం ఉంది. దీనికి కూడా ఎలక్షన్లే కారణం. మే 9కి.. ఏపీలో ఎలక్షన్స్ జరిగే మే 13 మధ్య 4 రోజుల టైం ఉంది.
TRIVIKRAM: టాలీవుడ్ గురూజీకి ఝలక్ ఇచ్చిన పాన్ ఇండియా స్టార్స్
అయినా రిలీజ్‌కి నో అంది ఫిల్మ్ టీం. కారణం ఓట్లేసే ముందురోజు, తర్వాత రోజు ఉండే హంగామా వల్ల కల్కి వసూళ్లు తగ్గుతాయనే అంచనా. సరే.. ఆ తర్వాత మే 16కి రిలీజ్ పెట్టుకోవచ్చు కదా అంటే ముహుర్త బలం లేదట. అందుకే మే 30 కి రిలీజ్ వాయిదా అనుకున్నారని తెలుస్తోంది. కాని జూన్‌లో ఓట్ల లెక్కింపు తర్వాత ఆంధ్రాలో కొత్త గవర్నమెంట్ ఏర్పడటం, తెలంగాణలో ఎంపీ ఎన్నికల తర్వాత ఏర్పడే రాజకీయ పరిస్తితులు కారణం. ఇవన్నీ సద్దుమణగటానికి నెల పడుతుంది.
అందుకే జులైలో రిలీజ్ పెట్టాలనేది ఫిల్మ్ టీం నిర్ణయం అని తెలుస్తోంది. శ్రీరామనవమిన ఎనౌన్స్ చేయబోయే డేట్ మాత్రం జులై 10 అని తెలుస్తోంది. ఆల్‌మోస్ట్ మే 30, జులై 10లో జులై 10వైపే అశ్వినీదత్, ప్రభాస్ మొగ్గుచూపిస్తున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఆ డేట్‌తో పోస్టర్ డిజైన్ అయ్యింది.