kalki review : ప్రభాస్ ఊచకోత.. మెంటలెక్కించాడు..

కల్కి 2898 AD.. పాన్ ఇండియా సినిమాల్లో ఈ సై-ఫై మూవీ సంచలనాత్మకంగా మారింది. ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కావడం, పైగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో కావడంతో అంచనాలు ఊహకందని విధంగా పెరిగాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 27, 2024 | 12:35 PMLast Updated on: Jun 27, 2024 | 12:35 PM

Kalki 2898 Ad This Sci Fi Movie Became Sensational In Pan India Movies

 

కల్కి 2898 AD.. పాన్ ఇండియా సినిమాల్లో ఈ సై-ఫై మూవీ సంచలనాత్మకంగా మారింది. ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కావడం, పైగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో కావడంతో అంచనాలు ఊహకందని విధంగా పెరిగాయి. దీనికి తోడు ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సాహసం చేశాడు. టీజర్స్, ట్రైలర్ లో హాలీవుడ్ స్థాయి విజువల్స్ అందరిని ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై క్యూరియాసిటిని పెంచాయి, దీంతో ఈ చిత్రం కోసం ఆడియెన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. దాదాపు ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న మూవీ ఎలా ఉందో రివ్యూ లో తెలుసుకుందాం

స్టోరీలైన్..
నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా విషయానికొస్తే ఇందులో ప్రధానంగా మూడు రకాల నగరాలను చూపించారు. ఇందులో మొదటిది ‘కాంప్లెక్స్’.. ఇక్కడ అన్ని రకాల వనరులు ఉంటాయి.. ఇక్కడే సుప్రీమ్ యాస్కిన్ కమల్ హాసన్ ఉంటాడు. తన సైన్యంతో ప్రపంచాన్నే శాసిస్తుంటాడు. ఇక భూ ప్రపంచమంతా వనరులను కోల్పోయి, నిర్జీవమైన దశలో ‘కాశీ’ పట్టణాన్ని చూపించారు. ఇక మరో ప్రధానమైన నగరం ‘శంబల’. ఇక్కడ సర్వమతాలకు చెందిన శరణార్థులు నివసిస్తూ ఉంటారు. తమని కాపాడేందుకు ఏదో ఒక రోజు ఓ మహా యోధుడు వస్తాడని వీళ్లంతా నమ్ముతూ ఉంటారు. మరోవైపు కల్కి రాక కోసం మహాభారతం జరిగిన ద్వాపర యుగం నుంచీ అశ్వత్థామ గా అమితాబ్ బచ్చన్ ఎదురుచూస్తూ ఉంటాడు.

ఇంకోవైపు ఏం చేసి అయినా సరే అన్నీ వనరులు ఉండే కాంప్లెక్స్‌లో సెటిల్ అయిపోవాలని భైరవ అయిన ప్రభాస్ ప్రయత్నాలు చేస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో సుమతి దీపిక పదుకొణె కడుపులో కల్కి పుట్టబోతున్నాడని యాస్కిన్‌ తెలుసుకుంటాడు. దీంతో ఆమెను తన దగ్గరికి తీసుకురావాలని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. ఈ విషయంలో సాయం చేస్తే కాంప్లెక్స్‌లోకి అనుమతిస్తామని భైరవకి యాస్కిన్ మనుషులు మాట ఇస్తారు. దీంతో ఎలాగైనా ఆ సుమతిని తీసుకురావాలని భైరవ బయలుదేరతాడు. అయితే కల్కిని కడుపున మోస్తున్న సుమతిపై ఈగ కూడా వాలకుండా రక్షిస్తానని అశ్వత్థామ మాటిస్తాడు. దీంతో భైరవ- అశ్వత్థామ మధ్య భీకర యుద్ధం జరుగతుంది. మరి ఈ వీళ్లిద్దరిలో ఎవరు గెలిచారు భైరవ అసలు క్యారెక్టర్ ఏంటి అసలు కల్కి ఎవరు… యాస్కిన్.. కల్కికి మధ్య యుద్ధం జరిగిందా ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

పర్పామెన్స్ విషయానికి వస్తే…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అదరగొట్టేశాడు. అమితాబ్, కమల్ హాసన్ యాక్షన్ నెక్ట్స్ లెవల్ ఉంటుంది. ప్రభాస్ లుక్స్, ఎంట్రీ సీన్ ఆయన అన్ని సినిమాల్లోకి టాప్ లో నిలుస్తుంది. అలాగే ప్రభాస్ సెన్స్ ఆఫ్ హ్యుమర్ చాలా బాగా ఆకట్టుకుంది. హై-వోల్టేజ్ యాక్షన్ ఆడియెన్స్ కు కిక్క్ ఇస్తుంది. అమితాబ్ – ప్రభాస్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు విజిల్స్ వేయించడంతో పాటు గూస్ బంప్స్ తెప్పించాయి. దీపిక , శోభన పర్పామెన్స్ అదుర్స్ అనిపిస్తోంది. విజయ్ దేవరకొండ, దుల్కార్ సల్మాన్ రోల్స్ ఆకట్టుకుంది. ఉహించని క్యాస్టింగ్ ఉన్నప్పటికి ఈసినిమాలో నటించిన వారు ఎవరికి వారు పోటీ పడి నటించారు. అన్ని క్యారెక్టర్లె తమ పరిమితి మేరకు నటించి.. ఆడియెన్స్ తో మంచి మార్కులే వేయించుకున్నారు.

టెక్నికల్ విషయానికి వస్తే…
కల్కి విజులవల్ ట్రీట్ అనేలా చేయడంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడు. సినిమా స్టార్ట్ అయిన 5 నిముషాలకే మనల్ని ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లడంలో సఫలం అయ్యాడు. బలమైన కథను చెప్పడంతో పాటు అద్భుతమైన క్యారెక్టరైజేషన్ చూపించారు డైరెక్టర్ . కానీ కొత్త లోకాన్ని నార్మల్ ఆడియెన్స్ కి అంతగా
ఎక్కవని…
కొన్ని సీన్లు కనెక్ట్ కాలేకుండా ఉన్నాయనే అభిప్రాయం కలుగుతోంది. గ్రౌండ్ బ్రేకింగ్ యాక్షన్, విజువల్స్, సాలిడ్ స్టోరీ, ఇంటర్వెల్ బ్యాంగ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ మాత్రం అరాచకం. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాని నిలబెట్టింది. కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూనే అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ ను చూపించారు. క్లైమాక్స్ ఒక్కటే ఇండియన్ సినిమా సత్తాను మరోసారి వరల్డ్ వైడ్ గా చాటిందంటున్నారు. సంగీతం, బీజీఎం అదుర్స్ అంటున్నారు.

ఈ మూవీ చూసిన తర్వాత నాగ్ అశ్విన్ థింకింగ్, టేకింగ్ కి ఫ్యాన్స్ కి నోట మాట రావట్లేదు. అంతేకాకుండా.. ప్రభాస్ కెరీర్లో ఈ మూవీ నిలిచిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పురాణాలు, ఇతిహాసాలను ఇప్పుడున్న టెక్నాలజీనే కాకుండా.. భవిష్యత్తులో వచ్చే సాకేంతికతకు జోడించి చూపించడం మాత్రం నెవర్ బిఫోర్ అంటున్నారు. ఇక చెప్పాలంటే ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా తీసుకోవడంలో నాగ్ అశ్విన్ అక్కడక్కడా తడబడ్డారు. కానీ విజువల్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. యాక్షన్ ఎపిసోడ్స్ ఆ మైనస్ లని కవర్ చేశాయి. దిమ్మ తిరిగే ట్విస్ట్ తో క్లైమాక్స్ లో నాగ్ అశ్విన్ కల్కి చిత్ర సీక్వెల్ కి హింట్ ఇచ్చి పార్ట్ 2 పై క్యూరియాసిటిని పెంచాడు.

ఓవరాల్ గా
కల్కి మూవీ విజువల్ ట్రీట్ . డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు మిగతా హీరోల ఫ్యాన్స్ కు నచ్చుతోంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లలోకి అడుగుపెట్టిన వారికి సరికొత్తలోకంలో విహరించిన ఫీలింగ్ కలుకుంది. మొత్తానికి మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ పై ప్రభాస్ దండయాత్ర మొదలైంది.