Kalki 2898 AD : ఓవర్‌ హైప్‌ కల్కిని ముంచిందా ?

కల్కి.. కల్కి.. కల్కి.. ఈ సినిమా గురించి ఫ్యాన్స్‌ ఎంతగా ఎదురుచూశారో. మేకర్స్‌ ఎంత హైప్‌ ఇచ్చారో.. ఫ్యాన్స్‌ ఇప్పుడు అంతే డిసప్పాయింట్‌ అవుతున్నారు. స్టోరీ, స్క్రీన్‌ ప్లే, బ్యాగ్రౌడ్‌ మ్యూజిక్స్‌, డబ్బింగ్‌.. ఈ సినిమాకు ఇవే మేజర్‌ డ్రా బ్యాక్స్‌. గ్రాఫిక్స్‌, ప్రభాస్‌, అమితాబ్‌ యాక్టింగ్‌ ఇవి ఈ సినిమాకు మేజర్‌ అస్సెట్స్‌. 25 పర్సెంట్‌ ఎంటర్టైన్‌మెంట్‌.. 50 పర్సెంట్‌ సెటప్‌.. 25 పర్సెంట్‌ ల్యాగ్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 27, 2024 | 03:40 PMLast Updated on: Jun 27, 2024 | 3:40 PM

Kalki Kalki Kalki How Much Fans Have Been Waiting For This Movie As Much Hype As The Makers Have Given The Fans Are Now Disappointed

కల్కి.. కల్కి.. కల్కి.. ఈ సినిమా గురించి ఫ్యాన్స్‌ ఎంతగా ఎదురుచూశారో. మేకర్స్‌ ఎంత హైప్‌ ఇచ్చారో.. ఫ్యాన్స్‌ ఇప్పుడు అంతే డిసప్పాయింట్‌ అవుతున్నారు. స్టోరీ, స్క్రీన్‌ ప్లే, బ్యాగ్రౌడ్‌ మ్యూజిక్స్‌, డబ్బింగ్‌.. ఈ సినిమాకు ఇవే మేజర్‌ డ్రా బ్యాక్స్‌. గ్రాఫిక్స్‌, ప్రభాస్‌, అమితాబ్‌ యాక్టింగ్‌ ఇవి ఈ సినిమాకు మేజర్‌ అస్సెట్స్‌. 25 పర్సెంట్‌ ఎంటర్టైన్‌మెంట్‌.. 50 పర్సెంట్‌ సెటప్‌.. 25 పర్సెంట్‌ ల్యాగ్‌. సింపుల్‌గా చెప్పాలంటే ఇదే కల్కి సినిమా రివ్యూ. సినిమా బాలేదా అంటే.. ఎస్‌ బాగుంది.. కానీ ఈ సినిమా మీద నెగటివ్ ఇంప్రెషన్‌ రావడానికి కారణం మేకర్సే. వాళ్లు ఇచ్చిన ఓవర్‌ హైప్‌ కారణంగానే కల్కి గురించి ఇలాంటి టాక్స్‌ వస్తున్నాయి.

 

ఎందుకంటే కల్కిని ఒక నార్మల్‌ సినిమా లాగా రిలీజ్‌ చేయలేదు. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో స్టార్ట్‌ చేస్తే చాలా విషయాల్లో కల్కిని ఎక్కడికో లేపి వదిలేశారు. దేశవ్యాప్తంగా ఈవెంట్లు నిర్వహించారు. సింపుల్‌గా చెప్పాలంటే కల్కి సినిమా గురించి తెలియని మాట్లాడుకోని ఇండియన్‌ మేబీ ఉండడేమో అనే స్థాయిలో సినిమాకు హైప్‌ ఇచ్చారు. ఇదే కల్కి ఫస్ట్‌ ఫెయిల్యూర్‌. ఈ హైప్‌తో ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాతో ఇక వరల్డ్‌వైడ్‌ సినీ ఇండస్ట్రీ రికార్డ్స్‌ బ్రేక్‌ అవుతాయి అన్న స్థాయిలో కల్కి మీద ఫ్యాన్స్‌ అంచనాలు పెంచుకున్నారు. ఇక నాగ్‌ అశ్విన్‌ ఒక్కో క్యారెక్టర్‌ని రివీల్‌ చేసిన తీరు.. మూవీని ప్రమోట్‌ చేసిన తీరుతో అంచనాలు భారీగా పెరిగాయి. నార్మల్‌గా సినిమాలకు 3 రకాల ఆడియన్స్‌ ఉంటారు. ఒకరు ఫ్యాన్స్‌, రెండు సినిమా లవర్స్‌, అకేషనల్‌ విజిటర్స్‌. ఫ్యాన్స్‌లో ఎవరినీ టచ్‌ చేసినా సినిమా అద్భుతంగానే ఉంది అంటారు. సినిమా లవర్స్‌ న్యూట్రల్‌గా ఎలా ఉంటే అలా ఉందని చెప్తారు. అకేషనల్‌గా విజిట్‌ చేసేవాళ్లు సినిమా అద్భుతంగా ఉంటే తప్ప నార్మల్‌ రివ్యూ ఇవ్వరు. కల్కి సినిమాకు నాగ్‌ అశ్విన్‌ ఇచ్చిన హైప్‌తో సినిమా లవర్స్‌తో పాటు అకేషనల్‌ విజిటర్స్‌లో కూడా ఇంట్రెస్ట్‌ పెరిగిపోయింది.

టికెట్ల కోసం అంతా ఎగబడ్డారు. కానీ ప్రమోషన్స్‌లో క్రియేట్‌ చేసిన హైప్‌ను థియేటర్‌లో రీచ్‌ అవ్వలేకపోయాడు నాగ్‌ అశ్విన్‌. ఒకవేళ ఇదే సినిమాను ఇంత హైప్‌ లేకుండా అన్ని ప్రభాస్‌ సినిమాలు ఎలా రిలీజ్‌ చేశారో అలాగే రిలీజ్‌ చేసి ఉంటే ఖచ్చితంగా రివ్యూ మరోలా వచ్చేది. ఇది మేం చెప్తున్న మాట కాదు థియేటర్స్‌ దగ్గర ఆడియన్స్‌ చెప్తున్న మాట. వందలో 80 చెప్పింది ఒక్కటే.. సినిమా చాలా బాగుంది.. కానీ ఎక్స్‌పెక్ట్‌ చేసినంత లేదు అని. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఆడియన్స్‌లో పెంచిన మేకర్స్‌ దాన్ని రీచ్‌ అవ్వడంలో మాత్రం ఫెయిల్‌ అయ్యారు. కల్కి విషయంలో సింపుల్‌గా జరిగింది ఇదే. సినిమాకు ఓవర్‌ హైప్‌ ఇచ్చేవాళ్లకు కల్కి ఈజ్‌ క్లాసిక్‌ ఎగ్జాంపుల్‌. కథని సినిమాను ప్రమోట్‌ చేసుకోవడం ముఖ్యమే.. కానీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ రీచ్‌ అవ్వలేని స్థాయిలో సినిమా ఉంటే.. రియాక్షన్స్‌ చాలా దారుణంగా ఉంటాయి.

గతంలో ఇదే సీన్‌ ఆదిపురుష్‌ సినిమాతో కనిపించింది. ఇప్పుడు అదే సీన్‌ కల్కి దగ్గర రిపీట్‌ అయ్యింది. ఇక్కడ బ్యాడ్‌లక్‌ ఏంటి అంటే రెండూ డార్లింగ్‌ ప్రభాస్‌ సినిమాలే. కల్కిని ఓ మంచి సోషియో ఫాంటసీ సినిమాగా చూసేందుకు వెళ్తే చాలా ఎంజాయ్‌ చేస్తారు. కానీ నాగ్‌ అశ్విన్‌ ఇచ్చిన హైప్‌ను వెతుక్కుంటూ వెళ్తే మాత్రం డిసప్పాయింట్‌ అవ్వడం పక్కా.