డాక్టర్ ఘటనలో కామాంధుడి.. సైకో ఎనాలిటిక్ టెస్టులో సంచలనాలు..

యావత్‌ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ ్కేసులో విచారణ చేస్తోన్న సీబీఐ పలు కీలక అంశాలు బయటపెడుతోంది. ప్రతీ అనుమానానికి ఆన్సర్ దొరికింది అనుకుంటే.. ఆ సమాధానం మరో ప్రశ్నను మిగిలిస్తోంది. దీంతో అసలు ఈ కేసులో ఏం జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 23, 2024 | 08:22 PMLast Updated on: Aug 23, 2024 | 8:22 PM

Kamandhu In The Doctor Incident Sensations In Psychoanalytic Test

యావత్‌ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ ్కేసులో విచారణ చేస్తోన్న సీబీఐ పలు కీలక అంశాలు బయటపెడుతోంది. ప్రతీ అనుమానానికి ఆన్సర్ దొరికింది అనుకుంటే.. ఆ సమాధానం మరో ప్రశ్నను మిగిలిస్తోంది. దీంతో అసలు ఈ కేసులో ఏం జరిగింది. డాక్టర్‌ మీద అత్యాచారం చేసింది సంజయ్ రాయ్ ఒక్కడే కాదా.. గ్యాంగ్‌రేప్ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్.

సీబీఐ విజ్ఞప్తి మేరకు నిందితుడు సంజయ్‌ రాయ్‌కు సైకోఎనాలిటిక్‌ టెస్టులు నిర్వహించారు. నిందితుడు వికృత ప్రవర్తన కలిగినవాడని… అశ్లీల వీడియోలకు బానిసై పోయాడని తేలింది. అతడిది పశువులాంటి స్వభావమని సీబీఐ అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనపై నిందితుడు ఎలాంటి పశ్చాత్తాపాన్నీ వ్యక్తం చేయలేదని అంటున్నారు. ఘటన జరిగిన తీరును.. ఎలాంటి తడబాటు లేకుండా వివరించాడని చెప్తున్నారు. ఘటనా స్థలంలో సంజయ్‌ ఉన్నాడనేందుకు ఆధారాలు లభించాయని… దీని వెనుక భారీ కుట్ర ఏదైనా ఉందా అనే అంశంలో సీబీఐ దర్యాప్తు చేస్తుందని చెప్పారు.

ఇక అటు సీబీఐ విచారణలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. హత్యాచారం జరిగిన సెమినార్‌ హాల్‌ డోర్‌ బోల్ట్‌ పనిచేయడం లేదని తమ విచారణలో బయటపడినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. బాధితురాలిని చిత్రహింసలు పెడుతున్న సమయంలో… సెమినార్‌ హాల్‌ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవరికీ వినిపించకపోవడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేరం జరుగుతున్న సమయంలో.. ఎవరూ లోపలికి రాకుండా ఉండేందుకు… హాల్‌ బయట నిల్చొని ఎవరైనా సహకరించారా అనే కోణంలో సీబీఐ విచారణ జరుపుతోంది. దీనికోసం సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు. తలుపు గొళ్లెం పనిచేయకపోవడంపై.. ఇంటర్న్‌లు, జూనియర్‌ డాక్టర్‌ సిబ్బంది తమ విచారణలో బయటపెట్టినట్లు సీబీఐ తెలిపింది. దీంతో బోల్ట్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.