CM Revanth Reddy : కమ్మ అంటే అమ్మ… రేవంత్ మాటల వెనక వ్యూహం ఇదా!
రేవంత్ మాట్లాడిన ఈ మాట.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను షేక్ చేస్తోంది. పైన అమ్మవారు.. కింద కమ్మవారు అని సినిమా డైలాగ్‌లు వేస్తూ.. కమ్మ సామాజికవర్గంపై పొగడ్తల వర్షం గుప్పించారు రేవంత్. రాజకీయంగా తనకు అవకాశం ఇచ్చిందే కమ్మవారు అని పరోక్షంగా చెప్పిన రేవంత్.. ఆ తర్వాత మాట్లాడిన మాటలు.. ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్.
రేవంత్ మాట్లాడిన ఈ మాట.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను షేక్ చేస్తోంది. పైన అమ్మవారు.. కింద కమ్మవారు అని సినిమా డైలాగ్‌లు వేస్తూ.. కమ్మ సామాజికవర్గంపై పొగడ్తల వర్షం గుప్పించారు రేవంత్. రాజకీయంగా తనకు అవకాశం ఇచ్చిందే కమ్మవారు అని పరోక్షంగా చెప్పిన రేవంత్.. ఆ తర్వాత మాట్లాడిన మాటలు.. ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. కమ్మవారు శ్రమకు, ప్రతిభకు నిదర్శనం అని.. కమ్మలు ఎక్కడ ఉన్నారనేది ఈజీగా గుర్తించొచ్చు అన్నారు. ఇక్కడితో ఆగితే ఇంకోలా ఉండేదేమో.. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని.. దాన్ని ఇక్కడ గత ప్రభుత్వాలు కాలరాశారంటూ.. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేసీఆర్ సర్కార్ నిర్ణయాలను గుర్తుచేస్తూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతున్నాయ్.
దీంతోపాటు గత ప్రభుత్వంలో కమ్మ సంఘానికి 5ఎకరాల స్థలం ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నారని.. ఐతే తమ ప్రభుత్వం మాత్రం కమ్మ సామాజికవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. కమ్మవారిని రేవంత్ ఈ రేంజ్‌లో పొగడడం వెనక పక్కా వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా చేయడమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. దీనికోసం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. 10మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మరికొంతమంది కూడా అదే దారిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. బీఆర్ఎస్‌ను వీక్ చేయడంతో పాటు.. కాంగ్రెస్‌ను మరింత స్ట్రాంగ్ చేసేందుకు రేవంత్ ఇలాంటి మాటలు మాట్లాడారా అనే చర్చ జరుగుతోంది. రెడ్డి కాంగ్రెస్ అని.. అందులో రెడ్డిలదే హవా అని హస్తం పార్టీ మీద ఓ ముద్ర ఉంది. కమ్మ సామాజికవర్గం అంతా.. మొదటి నుంచి కాంగ్రెస్‌కు కాస్త దూరంగానే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీతో నడిచిన ఆ వర్గం.. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలతో.. బీఆర్ఎస్ వైపు మళ్లింది.
ఇప్పుడు వారిన కాంగ్రెస్ మద్దతుదారులుగా మార్చుకునేందుకు రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే డిస్కషన్ సాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌లో మాత్రమే కాదు.. తెలంగాణవ్యాప్తంగా కమ్మ ఓటర్ల ప్రభావం ఉంది. రాష్ట్రంలో 5 నుంచి 6 శాతం తమ ఓటర్లు ఉన్నారని.. దాదాపు 35స్థానాల్లో ఫలితాలను నిర్ణయించే స్థాయి తమది అని.. కమ్మ ప్రతినిధులు చెప్తున్న మాట. ఇదంతా ఎలా ఉన్నా.. ఏపీలో ఎన్నికల సమయంలో ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలుస్తారంటూ జోస్యం చెప్పారు. అప్పటి నుంచి కమ్మ నేతలంతా కేసీఆర్ మీద, బీఆర్ఎస్ అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు వాళ్లందరినీ తమ వైపు లాక్కునేలా రేవంత్ మాటలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది.