Kangana Raunat : డేటింగ్‌పై కంగనా క్లారిటీ
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మధ్య ముంబైలో.. ఆమె ఓ యువకుడి చేయి పట్టుకుని సరదాగా వెళ్తూ కనిపించింది. ఓ సెలూన్ బయట ఇద్దరు సరదా సరదాగా అనిపించారు.

Kangana Clarity on Dating
బాలీవుడ్ (Bollywood) ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Raunat) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మధ్య ముంబై (Mumbai) లో.. ఆమె ఓ యువకుడి చేయి పట్టుకుని సరదాగా వెళ్తూ కనిపించింది. ఓ సెలూన్ బయట ఇద్దరు సరదా సరదాగా అనిపించారు. దీంతో అతడితో డేటింగ్‌లో ఉందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయ్. వీటిపై లేటెస్ట్‌గా కంగనా రియాక్ట్ అయింది. సెలూన్‌లో తనతో పాటు ఉన్న మిస్టరీ మ్యాన్ ఎవరని అడుగుతున్నారు… ఈ విషయంపై సోషల్ మీడియాలోనూ ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఒక అమ్మాయి, అబ్బాయి క్లోజ్‌గా కనిపిస్తే.. వారి మధ్య ప్రేమ ఉందని ఊహించుకుంటారా.. చనువుగా ఉండడానికి ఇతర కారణాలు చాలా ఉంటాయ్. వారు అన్నాదమ్ములు కావొచ్చు.. సహోద్యోగులు అయి ఉండొచ్చని కంగనా చెప్పుకొచ్చింది. తనతో ఉన్న వ్యక్తి తన హెయిర్ స్టైలిష్ట్ అని.. కొన్ని సంవత్సరాలుగా అతనికి తాను ఫ్రెండ్లీ కస్టమర్‌ని అని ఇన్‌స్టాలో క్లారిటీ ఇచ్చిందీ రింగుల జుట్టు బ్యూటీ. దీంతో ఈ డేటింగ్ రూమర్స్‌కు చెక్ పడినట్లైంది.
ఇక అటు సినిమాల విషయానికొస్తే కంగన నటించిన ఎమర్జెన్సీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీని కంగానానే డైరక్షన్ చేసింది. ఇందులో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా కనిపించనున్నారు. దీంతో పాటు సైకలాజికల్ థ్రిల్లర్‌కు సైన్ చేశారు. తను వెడ్స్ మను రిటర్న్స్‌తో ప్రేక్షకులను అలరించిన కంగన, మాధవన్ కాంబోలో 8 ఏళ్ల తర్వాత రాబోతున్న చిత్రమిది. ఏమైనా కంగనా క్లారిటీతో.. మొత్తమ్మీద ఓ పెద్ద చర్చకు బ్రేక్ పడినట్లు అయింది.