Kannada hero Darshan : కస్టడీలో కూడా మేకప్.. పవిత్ర పొగరు ఇంకా తగ్గలేదు
హత్య కేసులో అరెస్ట్ అయ్యి చిప్ప కూడు తింటున్నా.. కన్నడ హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర పొగరు మాత్రం తగ్గడంలేదు.

Kannada hero Darshan and his girlfriend Pavitra Poghar are not going down despite being arrested in a murder case.
హత్య కేసులో అరెస్ట్ అయ్యి చిప్ప కూడు తింటున్నా.. కన్నడ హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర పొగరు మాత్రం తగ్గడంలేదు. ఒక మనిషి ప్రాణం తీసినందుకు పశ్చాతాపం పడటం సరికాదు కదా.. అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఫీలవుతున్నారు ఇద్దరూ. పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో లిప్‌స్టిక్ వేసుకుని నవ్వుతూ వచ్చిన పవిత్ర ఇప్పుడు పోలీసుల కస్టడీలో కూడా మేకప్ వేసుకుని కనిపించడం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల అదుపులో ఉన్న పవిత్రను రీసెంట్‌గా విచారణ కోసం ఆమె ఇంటికి తీసుకువెళ్లారు. సీన్ రీ క్రియేషన్ చేసిన తరువాత పవిత్ర తన ఇంట్లో మేకప్ వేసుకుంది. లేడీ ఐస్సై కూడా పవిత్ర మేకప్ వేసుకునేందకు అంగీకరించింది.
ఇంటి నుంచి బయటికి మేకప్‌తో వచ్చిన పవిత్రను చూసి మీడియాతో సహా అంతా షాక్ అయ్యారు. ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో ఉన్నతాధికారులు ఆ ఎస్సైకి నోటీసులు జారీ చేశారు. కస్టడీలో ఉన్న ముద్దాయికి ఇలాంటి స్వేచ్ఛ ఎందుకు ఇస్తున్నారంటే ప్రశ్నించారు. వెంటనే ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ ఎస్సైకి నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసులో తవ్వుతున్న కొద్దీ భయంకరమైన నిజాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటి వరకూ 17 మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ హత్య చేయించేందుకు దర్శన్ తన గ్యాంగ్‌కు 70 లక్షలు ఇచ్చాడు. రేణుకాస్వామిని బెంగళూరుకు తీసకువచ్చి అత్యంత కిరాతకంగా హింసించి చంపేసినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది.
ఇంత దారుణంగా ఓ మనిషి ప్రాణం తీసినా.. కనీసం ఆ ఇద్దరు కిరాతకుల్లో కొంచెం కూడా పశ్చాతాపం కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు మీరు మనుషులా రాక్షసులా అని షాకవుతున్నారు పవిత్ర తీరు చూసినవాళ్లు. ఇక, ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. త్వరలోనే ఛార్జిషీట్ కూడా వేయడానికి రెడీ అవుతున్నారు పోలీసులు. మరి, ఛార్జిషీట్‌లో ఎలాంటి సంచలనాలు బయటికి వస్తాయో చూడాలి!