అప్పటి వరకూ రిటైర్ కావొద్దు రోహిత్,కోహ్లీలకు కపిల్ సలహా
భారత క్రికెట్ లో గత దశాబ్దకాలంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మదే ఆధిపత్యం... ఫార్మాట్ తో సంబంధం లేకుండా దుమ్మురేపుతున్న వీరిద్దరూ ఇటీవల టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు.
భారత క్రికెట్ లో గత దశాబ్దకాలంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మదే ఆధిపత్యం… ఫార్మాట్ తో సంబంధం లేకుండా దుమ్మురేపుతున్న వీరిద్దరూ ఇటీవల టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం వీరి వయసు దృష్ట్యా ఇంకా రెండు, మూడేళ్ళ తర్వాత రిటైరవుతారని పలువురు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తర్వాత గుడ్ బై చెప్పేస్తారని కొందరు అంటుంటే.. 2027 వన్డే వరల్డ్ కప్ వరకూ ఆడతారని మరికొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి రిటైర్మెంట్ పై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
26 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య ఏ క్రికెటర్ అయినా ప్రైమ్ టైమ్‌ని చూస్తాడని, ఆ మధ్యలో చేసిన పరుగులే అతని కెరీర్ ను డిసైడ్ చేస్తాయని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో వారి ఫిట్ నెస్, వయసు కూడా రిటైర్మెంట్ పై ప్రభావం చూపిస్తాయని చెప్పాడు. ప్రతీ ప్లేయర్ 40 ఏళ్ళ వరకూ ఆడే అవకాశం లేదని అయితే ఫిట్‌గా ఉండి, ఆటను ఎంజాయ్ చేస్తున్నంత కాలం ఆడొచ్చని కపిల్ చెప్పుకొచ్చాడు. జట్టుకు ఉపయోగపడుతున్నంత వరకూ రిటైర్ కావాలని ఏ ప్లేయర్‌ని అడిగే అధికారం ఎవ్వరికీ లేదన్నాడు. ఫిట్‌గా ఉంటూ… ఆటను ఆస్వాదిస్తూ ఎన్నాళ్లైనా ఆడాలని రోహిత్,కోహ్లీలకు కపిల్ దేవ్ సూచించాడు.