Karnataka Congress: కర్ణాటకలో విద్యుత్ సరఫరాపై కేసీఆర్‌ది అబద్ధపు ప్రచారం: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి జార్జ్
కర్ణాటకలో కరెంట్ లేదని కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారు. కర్ణాటకలో రైతులకు అవసరమైన కరెంట్ ఇస్తున్నాం. కొన్ని అవాంతరాలు వచ్చినా కూడా వాటిని అధిగమించి రైతులకు అవసరమైన కరెంట్ అందిస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెవుతున్నారంటే అది గత కాంగ్రెస్ ప్రభుత్వ కృషి ఫలితం.
Karnataka Congress: కర్ణాటకలో రైతులకు తగినంత విద్యుత్ ఇవ్వడం లేదని తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి జార్జ్. అక్కడి రైతులకు అవసరమైనంత విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జార్జ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేస్తున్నాం. కర్ణాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాదయాత్ర చేసినపుడు అనేక మందితో ప్రత్యేకంగా కలిశారు.
REVANTH REDDY: కేసీఆర్ బకాసురుడు.. పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బంగారు మయమైంది: రేవంత్ రెడ్డి
ప్రజల నుంచి వచ్చిన అన్ని విజ్ఞప్తులను ఆయన మేనిఫెస్టోలో పెట్టి అమలు చెయ్యాలని చెప్పారు. మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ ఇద్దరూ ప్రజల సంక్షేమం కోసం కృషిచేశారు. కర్ణాటకలో మేము 5 గ్యారంటీలు ఇచ్చాం. వాటిన్నింటినీ అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్ సమావేశంలోనే వాటిని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అన్న భాగ్య పథకం కింద 10 కిలోల బియ్యం పేదలకు ఉచితంగా ఇస్తామన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం బియ్యం సరఫరా చేయకపోవడంతో మేము పేదలకు బియ్యం డబ్బులు ఇస్తున్నాం. పేదల సంక్షేమం కోసం ఇందిరాగాంధీ అమలు చేసిన 20 సూత్రాల పథకం ఇల్పాటికీ అమలు అవుతోంది. ఇక్కడ కేసీఆర్ కర్ణాటకలో కరెంట్ లేదని అబద్ధాలు చెప్తున్నారు. కర్ణాటకలో రైతులకు అవసరమైన కరెంట్ ఇస్తున్నాం. కొన్ని అవాంతరాలు వచ్చినా కూడా వాటిని అధిగమించి రైతులకు అవసరమైన కరెంట్ అందిస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెవుతున్నారంటే అది గత కాంగ్రెస్ ప్రభుత్వ కృషి ఫలితం. దేశంలో కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున బలపడుతోంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ విస్తరిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తోంది” అన్నారు. మరో కర్ణాటక నేత అజయ్ కుమార్ మాట్లాడుతూ.. “కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంది. ఇది దేశంలో మొట్టమొదటి సారి. తెలంగాణలో కేసీఆర్ అన్ని అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్‌ఘడ్ నుంచి పవర్ ఎందుకు కొంటుంది..? అంటే ఇక్కడ పవర్ ఉత్పత్తి అవడం లేదు. ప్రభుత్వం డిస్కమ్స్‌కు 3 వేల కోట్ల రూపాయల బకాయి ఉంది. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న కరెంట్‌పై కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలు ఆడుతున్నారు. ఇక్కడ కర్ణాటక మంత్రి ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు వేచి చూస్తాం. చర్చకు సిద్ధంగా ఉన్నాం” అని వ్యాఖ్యానించారు.