Sumalatha Ambareesh: బీజేపీలోకి సుమలత.. మాండ్య నుంచి పోటీ చేస్తారా..?
సుమలత ఇండిపెండెంట్ ఎంపీ అయినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో ఆమె బీజేపీలో చేరుతారని చాలా కాలం నుంచి ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగానే.. తాను బీజేపీలో చేరబోతున్నట్లు సుమలత ఇటీవల ప్రకటించారు.

Sumalatha Ambareesh: సీనియర్ నటి, దివంగత అంబరీష్ సతీమణి సుమలత శుక్రవారం బీజేపీలో చేరారు. బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర చీఫ్ బీవై విజయేంద్ర సమక్షంలో సుమలత బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అది కూడా మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్‌పై పోటీ చేసి విజయం సాధించారు.
ALI YSRCP: వైసీపీ ప్రచారానికి అలీ డుమ్మా ! అసలేం జరిగింది ?
సుమలత ఇండిపెండెంట్ ఎంపీ అయినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో ఆమె బీజేపీలో చేరుతారని చాలా కాలం నుంచి ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగానే.. తాను బీజేపీలో చేరబోతున్నట్లు సుమలత ఇటీవల ప్రకటించారు. ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ.. తాను స్వతంత్ర ఎంపీ అయినప్పటికీ.. తన మాండ్య నియోజకవర్గ అభివృద్ధికి బీజేపీ సహకరించిందన్నారు. రూ.4,000 కోట్ల నిధుల్ని మాండ్యకు విడుదల చేసిందని కేంద్రంపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు పార్టీకి తన అవసరం ఉందని, పార్టీ వీడొద్దని మోదీ అడిగినప్పుడు తాను గౌరవించి తీరాలని సుమలత అన్నారు. బీజేపీ నేతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈసారి సుమలత బీజేపీ తరఫున మాండ్య నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ, అది జరగడం లేదు.
కారణం.. కర్ణాటకలో జేడీఎస్-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా మాండ్య సీటు జేడీఎస్‌కు దక్కింది. ఇక్కడి నుంచి మాజీ సీఎం కుమారస్వామి బరిలోకి దిగుతున్నారు. దీంతో సుమలత పోటీ నుంచి తప్పుకొన్నారు. అయితే, సుమలత బీజేపీతోపాటు పొత్తులో భాగంగా జేడీఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేసే అవకాశాలున్నాయి. అలాగే సుమలతను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరుగుతోంది.