Kartika festival Srisailam : నేటి నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. ఇక ఇవాళ్టీ నుంచి వచ్చే నెల 23 వరకు కార్తీక ఉత్సవాలు
ఇక నేటి నుంచి వచ్చే నెల 23 వరకు కార్తీక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ దర్శన సమయంలో మార్పులు చేసి.. స్వామివారి దర్శన కు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన కార్తీకమాసం శోభ (Kartika Masotsavalu) .. పుణ్యక్షేత్రాలకు పోట్టెత్తిన భక్తులు.. ఉదయం నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు వేకువ జామునే పుణ్యస్నానాలు ఆచరిస్తూ..దీపాలు వెలగిస్తూ.. దేవుడికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. కార్తీక మాసం అంటే తెలుగు క్యాలెండర్ లో 8వ నెల. ఈ నెలలో కార్తీక మాసంలో భక్తులు ఎక్కువగా విష్ణువును , శివుడు ను పూజిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా దేవి.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి మల్లికార్జున స్వామి (Srisaila Mallikarjuna) కలిసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఇక కార్తీక మాసం శోభలో.. శ్రీశైలం పుణ్యక్షేత్రం కార్తీక మాసోత్సవాలకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఇవాళ్టి నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇక నేటి నుంచి వచ్చే నెల 23 వరకు కార్తీక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ దర్శన సమయంలో మార్పులు చేసి.. స్వామివారి దర్శన కు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
IMD : భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
ప్రధాన ఆలయ ద్వారాలు ఉదయం 3.30 గంటలకు తెరవనున్నారు. తెల్లవారుజామున 4 నుండి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామి వారిని భక్తులు దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. శని, ఆది, సోమవారాలు, పర్వదినాల్లో స్వామివారి అలంకార దర్శనం భాగ్యం కల్పిస్తారని, బుధవారం నుంచి శుక్రవారం వరకు స్పర్శ దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచి.. శ్రీ మల్లికార్జున స్వామికి భక్తులు నిర్వహించే గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. భక్తుల రద్దీ ఉండనున్న నేపథ్యంలో.. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
S.SURESH