రీఎంట్రీ ఇస్తా కరుణ్ నాయర్ కాన్ఫిడెన్స్
మహారాజా టీ20 ట్రోఫీలో కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ సంచలన ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. కేవలం 43 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు.

మహారాజా టీ20 ట్రోఫీలో కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ సంచలన ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. కేవలం 43 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత భారత టెస్ట్ జట్టులోకి రావడమే తన లక్ష్యమని కరుణ్ నాయర్ తన మనసులో మాట బయట పెట్టాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే ఇప్పుడు తన ఏకైక లక్ష్యమని చెప్పాడు. మళ్ళీ భారత టెస్ట్ క్రికెట్ జట్టులో స్థానం సంపాదిస్తాననే నమ్మకం తనకుందన్నాడు. గత ఏడాది కాలంలో అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణించానని గుర్తు చేశాడు. 2016 లో ఇంగ్లాండ్ పై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ సెహ్వాగ్ తర్వాత టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన భారత ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. ఆ తర్వాత పేలవ ఫామ్ తో జట్టుకు దూరమయ్యాడు.