Katrina Kaif Pregnancy : కత్రినా కైఫ్ తల్లి కాబోతోందా..
బాలీవుడ్ (Bollywood) నటి కత్రినా కైఫ్ (Katrina Kaif) గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కత్రినా తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ (Pre wedding function) లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆమె లుక్స్ వైరల్ అయ్యాయి.

Katrina Kaif Pregnancy
బాలీవుడ్ (Bollywood) నటి కత్రినా కైఫ్ (Katrina Kaif) గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కత్రినా తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ (Pre wedding function) లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆమె లుక్స్ వైరల్ అయ్యాయి. కత్రినా కైఫ్ గర్భవతి (Pregnant) అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ జంట ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో ఈ శుభవార్త చెబుతారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహం జరిగి రెండేళ్లు దాటింది. కత్రినా కైఫ్ తల్లికాబోతోందంటూ ఇప్పటికే చాలాసార్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఈ జంట తల్లిదండ్రుల కాబోతున్నారనే శుభవార్త వినాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల దీపికా పదుకొణె- రణవీర్ సింగ్ కూడా తాము తల్లిదండ్రులు అవుతున్నామని ప్రకటించారు. ఇప్పుడు కత్రినా- విక్కీ కౌశల్ జంటపై ఇలాంటి వార్తే వైరల్ అవుతోంది.
కత్రినా కైఫ్ జామ్‌నగర్ నుంచి తిరిగి వచ్చిన సమయంలో తన భర్త విక్కీతో కలిసి ముంబై విమానాశ్రయంలో ఉన్న సమయంలో తీసిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె ధరించి డ్రెస్ బట్టి ప్రెగ్నెంట్ అని అంటున్నారు. కత్రినా త్వరలో శుభవార్త చెబుతుందని వీడియో చూసిన అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. అంబానీ కుటుంబ వేడుకల్లో కత్రినా కైఫ్ ఎక్కడా డ్యాన్స్ చేయలేదు. ఇంతకు ముందు కూడా కత్రినా వంతారాకు విహారయాత్రకు వెళ్లిన సమయంలోనూ వదులుగా ఉండే మ్యాక్సీ డ్రెస్‌లో కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భం దాల్చిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
కత్రినా- విక్కీ కౌశల్ వీడియో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా దీపికా పదుకొనే, వరుణ్ ధావన్, యామీ గౌతమ్ లాంటి సెలబ్రిటీలు తమ అభిమానులకు శుభవార్త అందించారు. ఇప్పుటు కత్రినా కూడా ఇలాంటి వార్తను చెబుతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.